NTV Telugu Site icon

PV Sindhu: కాబోయే భర్తతో పీవీ సింధు ఎంగేజ్‌మెంట్ ఫోటోస్.. వైరల్

Pv Sindhu

Pv Sindhu

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.. తాజాగా.. తనకు కాబోయే భర్తతో ఎంగేజ్‌మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాబోయే వధూ వరులు పీవీ సింధు, వెంకట దత్తసాయి ఉంగరాలు మార్చుకున్నారు. అలాగే ఇద్దరూ కలిసి కేక్ కట్ చేశారు. కాగా.. ఆ ఫోటోలను పీవీ సింధు ఈరోజు (శనివారం) సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఎంగేజ్‌మెంట్ ఫోటోను ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఓ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చారు. ‘ఒకరి ప్రేమ మనకు దక్కిన సమయంలో.. తిరిగి మనం ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమ తనంతట తాను ఏమీ ఇవ్వదు’ అంటూ హార్ట్ టచింగ్ కామెంట్స్ చేశారు. కాగా.. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ, క్రీడా ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు విషెస్ తెలుపుతున్నారు.

Read Also: Haryana: మరోసారి వార్తల్లోకెక్కిన నూహ్.. రెండు పార్టీల మధ్య రాళ్ల దాడి, యువతి మృతి

పీవీ సింధు‌-వెంకట దత్తసాయి వివాహం ఈ నెల 22న రాజస్థాన్ లో జరగనుంది. ఉదయ్ పూర్ ప్యాలస్ లో వీరి పెళ్లి వేడుక అట్టహాసంగా జరగనుంది. అనంతరం.. డిసెంబర్ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేశారు. కాగా.. పెళ్లి వేడుకలు డిసెంబర్ 20 నుండి ప్రారంభం కానున్నాయి.

Read Also: Sukhvinder Sukhu: సీఎంను చుట్టుముట్టిన “కోడి కూర” వివాదం.. అసలేం జరిగింది? (వీడియో)

Show comments