NTV Telugu Site icon

Puvvada Ajay Kumar : కేసీఆర్‌ని సాదుకుంటారో సంపుకుంటారో మీ ఇష్టం

Puvvada

Puvvada

ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి సండ్ర వెంకట వీరయ్య అని వ్యాఖ్యానించారు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధిదేశంలో ముందు ఉండే వ్యక్తి సండ్ర అని, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యే వారి మధ్య ఉండటమన్నారు. సండ్ర నాలుగవసారి ఎమ్మెల్యేగా గెలుస్తారని, సాదుకుంటే ప్రజలకు ఉపయోగపడతారన్నారు. సంపుకుంటే మీరే నష్టపోతారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ని సాదుకుంటారో చంపుకుంటారో మీ ఇష్టమని, భారతదేశంలో దేశం కోసం పన్నుల రూపంలో ఇచ్చేది మన రాష్ట్రమన్నారు. కేంద్రాని సాకుతున్నాము. మనల్ని కేంద్రం సాగుతున్నారని, దేశానికి తిండిగింజలని ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు.

Also Read : Shane Watson: కోహ్లీ కడుపులో మంట కావొచ్చు.. కోహ్లీ-గంగూలీ వివాదంపై షేన్ వాట్సన్

అంతేకాకుండా.. ‘అందులో సత్తుపల్లి నియోజకవర్గ ఒకటి. ఎన్నికల సమయం వస్తుందని కొందరు ప్రజల మధ్యకు వస్తున్నారు.. కనీసం కాకరకాయలు పంచని నాయకులు వస్తున్నారు.. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నది ఎవరు.. అప్పుడు ఈ నాయకుల ఎటు పోయినారు.కరోనా సమయంలో లేని నాయకులు ఇప్పుడు వచ్చి కళ్ళబోల్లి కబుర్లు చెబుతున్నారు.. ఓటు నోటు కేసులో ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని ప్రయత్నం చేశారు.. దేశంలో ఎక్కడ పెట్టని విధంగా 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశాం.. దేశంలో ఎక్కడా లేనివిధంగా సెక్రటేరియట్ నిర్మిస్తున్నాం.. ఆ సెక్రటేరియట్ కి అంబేద్కర్ పేరు పెడుతున్నాం… ఆత్మీయ సమ్మేళనాలతో నీ జడత్వం వదులుకోవాలి… అందుకే ఆత్మీయ సమ్మేళనాలు… అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ వస్తుంది… తక్కువ సమయం ఉంది అందువలన ఇప్పటినుంచే ప్రజలలోకి అభివృద్ధి పథకాలను తీసుకెళ్లాలి.. తెలంగాణ రాకముందు 75 లక్షల వాహనాలు ఉంటే ఇప్పుడు ఒక కోటి 55 లక్షల వాహనాలు ఉన్నాయి… 53 లక్షల టూ వీలర్లు ఉంటే ఇప్పుడు ఒక కోటి 20 లక్షలు ఉన్నాయి.. ఆ విధంగా రవాణా కోసం రోడ్లను అభివృద్ధి చేసినాము… మన ఏడు మండలాల గుంజుకున్నారు… సిలేరు విద్యుత్ ప్రాజెక్టును కూడా తీసేసుకున్నారు..’ అని ఆయన అన్నారు.

Also Read : Shreyas Iyer: టీమిండియాకు గుడ్ న్యూస్.. శ్రేయస్ సర్జరీ సక్సెస్

Show comments