Site icon NTV Telugu

Puvvada Ajay Kumar : ఖమ్మంలో కడప రాజకీయం

Puvvada Ajay Kumar Bandi Sanjay

Puvvada Ajay Kumar Bandi Sanjay

పోలీసులపై దాడికి పాల్పడ్డ షర్మిలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోలీసులపై కూడా దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఖమ్మంలోనూ కడప తరహా రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణకు సీఎం కేసీఆర్‌ శ్రీరామ రక్షగా ఉంటారని ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. అమిత్ షా ముస్లింలకు రిజర్వేషన్ ఎత్తివేస్తాం అంటుండు, బండి సంజయ్ సచివాలయం కూల్చివేస్తామంటుండు.

Also Read : Vishnu Vardhan Reddy: వైఫల్యాలపై ఛార్జీషీట్లు.. దోపిడీని ప్రజలకు వివరిస్తాం..!

మరొకడు ప్రగతి భవన్ కూల్చుతాం అంటున్నారు. మరోవైపు షర్మిళ పోలీసు కానిస్టేబుల్‌ని కొట్టింది. కడప పోగరు చూపిస్తుంది. ఎక్కడఎక్కడ నుండో వచ్చి కేసీఆర్‌ని తూలనాడుతున్నారు అంటూ మంత్రి అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, దేశం ప్రజలంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారంటూ పువ్వాడ అజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 159 మెడికల్ కళాశాలలు దేశ వ్యాప్తంగా మంజూరు చేస్తే తెలంగాణకి ఒక్క కళాశాల మంజూరు చేయలేదని అన్నారు. కానీ, సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేశారు. పిహెచ్‌సిలు ఏర్పాటు చేశారని అన్నారు.

Also Read : Naveen Polishetty: ఓయ్.. జాతిరత్నం.. ‘అనగనగ ఒక రాజు’ అన్నావ్.. ఉందా..? లేదా..?

Exit mobile version