NTV Telugu Site icon

Puvvada Ajay : కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. ఓట్లు అడగడం సమంజసం కాదు

Puvvada

Puvvada

ఖమ్మం బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం ముందుకు వెళ్ళిందని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హత్యా రాజకీయం జరిగి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో రక్తపు బొట్టు కిందపడకుండా రాష్ట్రాన్ని సాధించుకున్నామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు వచ్చి ప్రజలను ఓట్లు అడగడం సమంజసం కాదన్నారు పువ్వాడ అజయ్‌ కుమార్‌. మీకు అనుకూలంగా ఉన్న ఛానెల్, పేపర్ లలో కథనాలు రాపిస్తే నిజాలు అయిపోవు అని గుర్తించాలన్నారు. సుపారి ఇచ్చాం అంటున్నారు.. మన జిల్లాకు, రాష్ట్రానికి సూపారి ఇచ్చే అలవాటు లేదు, ఇది తెలంగాణ.. బీహార్, రాయలసీమ ప్రాంతాలు కాదని, ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేశామే తప్పా, ఇటువంటి చర్యలకు మేము ఎప్పుడు పాల్పడలేదు.. పాల్పడం కూడా అని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా..’అప్పటి మాజీ మంత్రి మీద దాడికి కుట్ర చేశాం అంటున్నారు, ఆయనకు పేరు వస్తుంటే దాడి ఎందుకు చేస్తాం. పార్లమెంట్ ఎన్నికలు వస్తుంటే మీరు ఇచ్చిన హామీలు నేరవేర్చలేదు, ఇప్పుడు ఎలా ఓట్లు అడగాలో అర్థం కాక అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిజమని తేలితే చట్టరీత్య చర్యలు తీసుకోండి. ఇస్తామన్న హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు తూచ్ అనడం సరికాదు. నాపై, మా పార్టీ నాయకులపై చేసిన ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే వ్యతిరేకత వచ్చి నామా నాగేశ్వరరావుకు అనుకూలంగా సర్వే లు వస్తున్నాయి.’ అని ఆయన అన్నారు.

బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అధికారంలోకి రాగానే 6 హామీలు నెరవేరుస్తామని మాట తప్పరు. కాంగ్రెస్ పార్టీ మీద అన్ని వర్గాల్లో ఉన్న ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, 10 ఏళ్లు సుభిక్షంగా ఉన్న రాష్ట్రాన్ని, పుష్కలంగా ఉన్న నీళ్లను ఎండబెట్టి కరువు తీసుకుని వచ్చారన్నారు. మన జిల్లాలో కూడా పంట నష్టం వచ్చింది, మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం.. పంట నష్టపోయిన వారికి నష్టపరిహారం ప్రకటించాలని కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని, మేము రాష్ట్రంలో, కేంద్రంలో రాష్ట్రం తరపున పొరాడుతాం. నెల నుండి మేమంతా మొదటి విడతగా అన్ని మండలాల్లో ప్రచారం నిర్వహించామన్నారు పువ్వాడ అజయ్‌ కుమార్‌. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో సమస్యలు వచ్చాయి. రైతు బంధు కూడ ఇప్పటికీ రైతుల ఖాతాలో పడలేదని, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో ఆశీర్వదిస్తారు. 17 వ లోక్ సభలో 4 బీజేపీ, 3 కాంగ్రెస్ వాళ్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం గురించి లోక్ సభ లో ఏ ఒక్కరూ మాట్లాడలేదన్నారు. తెలంగాణ ప్రజల తరఫున కొట్లడింది కేవలం బీఆర్ఎస్ పార్టీనే. ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనించాలని, మన తెలంగాణ గొంతుక పార్లమెంట్ లో వినిపించాలి అంటే బీఆర్ఎస్ ఎంపీ లను అధిక సంఖ్యలో గెలిపించాలి. ఈ నెల 29 న జిల్లాలో మన నాయకుడు జిల్లాకు రానున్నారు, భారీ రోడ్ షో ఉంటుంది, ఆ రోజు రాత్రి ఇక్కడే మన నాయకుడు బస చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

రాజ్యసభ సభ్యులు, ఎంపీ గాయత్రి రవి మాట్లాడుతూ.. గత 20 రోజులుగా నామా నాగేశ్వరరావు ప్రచారం నిర్వహిస్తున్నామని, ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసిన నాయకుడు, ఖమ్మం జిల్లాకు రహదారులు వచ్చేలా చేసిన నాయకుడు నామా నాగేశ్వరరావు అని ఆయన అన్నారు. బీఆర్ ఎస్ పార్టీ బీజేపీ కి బి-టీం అంటారు. బీజేపీ ప్రవేశ పెట్టిన రైతుల చట్టాలను వ్యతిరేకించింది మేమే అని ఆయన అన్నారు. మళ్ళీ ఒకసారి ఖమ్మం జిల్లా అభివృద్ధి తో ముందుకు వెళ్ళాలి అంటే నామా నాగేశ్వరరావుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకుని అన్ని సంక్షేమ పథకాలతో రాష్ట్రం ముందుకు వెళ్ళిందని, రాష్ట్ర ప్రజలు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అంటే నమ్మి ఓటు వేస్తే మోసం చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెట్టీ ఖమ్మం కు కూడా తీసుకుని వచ్చారని ఆయన అన్నారు.