బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. పినపాక ఎమ్మెల్యే బుల్లెట్ మాదిరి ఉన్నాడు.. పని చేసే ఎమ్మెల్యే దొరకడం పినపాక నియోజకవర్గ అదృష్టమన్నారు. తన సమయం మొత్తం కేవలం నియోజకవర్గ అభివృద్ది కోసం పని చేస్తాడు.. నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు.. సెక్రటేరియట్ లో చూస్తూనే ఉంటానని ఆయన అన్నారు. ఆర్టీసీ నూతన బస్ స్టాండ్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఅర్ ఇచ్చిన SDF నిధుల నుండి రూ.5 కోట్లు వెచ్చించడం మంచి విషయమన్నారు. పౌర సేవల కోసం, మణుగూరు అభివృద్ది కోసం రూ.25 కోట్లు కేటాయించడం వారికే సాధ్యమైందన్నారు.
Also Read : Chandrababu Arrested Live Updates: సీఐడీ ఆధీనంలో చంద్రబాబు.. కొనసాగుతున్న విచారణ
అంతేకాకుండా.. ‘దండాలు పెట్టుకుంటు.. తల నిమురుకుంటూ.. మెడ వంకర పెట్టి కౌగులించుకుంటే జరుగుతదా అభివృద్ది… నిధుల వేట కోసం రేగ కాంతారావు నిత్యం తిరుగుతారు. అలాంటి మంచి ఎమ్మేల్యే ఉండటం మీ అదృష్టం.. ఇలాంటి వాళ్ళను గెలిపించుకోవాలి. BRS ప్రభుత్వంను తెచ్చుకోవాలి. కరోనా సమయంలో మీరేం చేశారు..? గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్తాం… మేం పనిచేశామని…BRS ప్రభుత్వం పని చేసిందని.. BRS కార్యకర్తలు తమకు తోచిన రీతిలో పని చేశారని.. గోదావరి వరదలు వచ్చాయి.. ప్రజల ప్రాణాలు పోకుండా కంటికిరెప్పలా కాపాడుకున్నాం. గోదావరి అటువైపు నేను .. ఇటు వైపు రేగ కాంతారావు వరదల్లో పని చేశాం. మీరేం చేశారు..? ఇక్కడ నిద్రపోయారో చెప్పాలి.
Also Read : Kushitha Kallapu: చీరకట్టులో కనికట్టు చేస్తున్న బజ్జీల పాప కుషిత
అలాంటి వాళ్ళను మనం గెలిపించుకోవాలా…మనకు పని చేసే వారినే మనం గెలిపించుకోవాలి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 16వేల మందికి పోడు భూముల పట్టాలు కేసీఅర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఅర్ మన జిల్లా రైతాంగం కోసం, ప్రజల కోసం రూ.13వేల కోట్ల రూపాయలతో సీతారామ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చి..లక్షల ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు అందించేందుకు పని చేస్తున్నారు.. మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5సీట్లు,ఖమ్మం జిల్లాలోని 5 సీట్లు గెలిపించుకుని కేసీఅర్ కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు మంత్రి పువ్వాడ.