భారతీయ వంటకాల్లో ఉల్లిపాయ ఎంతో ముఖ్యమైనది. ప్రతి వంటకాల్లోనూ ఉల్లిపాయను వేస్తుంటారు. ఉల్లిపాయను సుగంధ ద్రవ్యాల కోసం, ఆహార రుచిని పెంచడానికి కూరల్లో వాడుతుంటారు. అయితే తరుచుగా తరిగిన ఉల్లిపాయలను ఫ్రిజ్ లో ఉంచుతారు. అలా కట్ చేసిన ఉల్లిపాయలను ఫ్రిజ్ లో ఉంచితే మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దాంతో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓ నివేదిక ప్రకారం.. కోసిన ఉల్లిపాయలను బహిరంగ ప్రదేశంలో ఉంచడం వల్ల వాటిలో బ్యాక్టీరియా పెరుగుతుందని పేర్కొంది. కట్ చేసిన ఉల్లిపాయలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం మంచిది కాదు. అవి ఫ్రిజ్ లో చెడు వాసను వ్యాపింపజేస్తాయి. అందువల్ల రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన ఇతర ఆహార పదార్థాలకు వాసన వ్యాపిస్తుంది. దీంతో ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం రుచి కూడా మారుతుంది.
Shami’s wife: షమీ మంచి ఆటగాడే.. కుటుంబ విషయాల్లో మాత్రం..!
తరిగిన ఉల్లిపాయలలో తేమ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా.. వీటిని రిఫ్రిజిరేటర్‌లో పెట్టడం ద్వారా క్రిస్పీ దనం కోల్పోతాయి. ఈ అధిక తేమ ఉల్లిపాయలను లూజుగా మారుస్తుంది. దీనివల్ల వ్యాధికారక కారకాలకు దారితీస్తుంది. ఉల్లిపాయల్లోని పోషక స్థాయిలు తగ్గిపోతాయి. బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తుంది. తరిగిన ఉల్లిపాయలు రిఫ్రిజిరేటర్ యొక్క చల్లని ఉష్ణోగ్రతలతో స్పందించగల ఎంజైమ్‌లను కలిగి ఉంటాయి. ఈ ప్రతిచర్య సల్ఫరస్ సమ్మేళనాలు ఏర్పడటానికి దారితీస్తుంది. ఎందుకంటే ఉల్లిపాయలు సల్ఫర్‌ను కలిగి ఉంటాయి. దీంతో.. ఆ ఉల్లిపాయలను మీ వంటలలో అసహ్యకరమైన, చేదు రుచిని కలిగిస్తుంది. ఈ సమ్మేళనాలు గది ఉష్ణోగ్రత కంటే రిఫ్రిజిరేటర్‌లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
World Cup Final: సింగిల్ రూంకి రూ.1.25 లక్షలు.. చుక్కల్ని అంటుతున్న హోటల్ రేట్లు, విమాన ఛార్జీలు..
ఉల్లిపాయలను కట్ చేసి..పై తోలు తీసేసి నిల్వచేయడం వల్ల మరో ప్రమాదం కూడా ఉంది. ఉల్లిపాయలు కత్తిరించినప్పుడు.. ఆ కణాలు దెబ్బతిని, ఉల్లిపాయల నుంచి రసాలు విడుదలవుతాయి. ఇవి బ్యాక్టీరియాను ఆకర్షించి వాటి పెరుగుదలకు కారణమయ్యే పోషకాలుగా మారిపోతాయి. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యుఎస్డిఎ) ప్రకారం.. ఉల్లిపాయలను 40 డిగ్రీల ఫారెన్హీట్ లేదా ఫ్రిజ్ లోపల 4.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద సీలు చేసిన కంటైనర్లో ఉంచడం ఉత్తమ మార్గం.