Site icon NTV Telugu

MLA Sridhar Reddy: కుటిల రాజకీయాలు అవసరం లేదు.. వాళ్ల నాన్న ఏమైనా టాటా నా, బిర్లా నా..?

Sridhar Reddy

Sridhar Reddy

MLA Sridhar Reddy: పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆస్తులను వేలం వేయనున్నట్టు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన జారీ చేయడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. మెసర్స్‌ ఏఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ (మెసర్స్‌ సాయిసుధీర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌) కంపెనీకి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి భార్య అపర్ణరెడ్డి, ఆయన తండ్రి వెంకటరామిరెడ్డి డైరెక్టర్లు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి షూరిటీగా కంపెనీ రుణాలు తీసుకుంది. ఆ లోన్లు సకాలంలో చెల్లించకపోవడంతో ఆగస్టు 18న ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంకు ఓ ప్రటనలో పేర్కొంది.. అయితే, దీనిపై రాజకీయ దుమారం రేగింది.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలకు దారితీసింది.. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి.. తనపై తప్పుడు ప్రచారం సాగుతోందని.. కావాలనే కొందరు పనిగట్టుకొని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు..

Read Also: Chain Snatching: చైన్ స్నాచింగ్ దొంగలు అరెస్ట్.. 16 తులాల బంగారం, రెండు బైక్‌లు, ఒక ఆటో..

ఇక, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి.. కుటీల రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు.. మా పార్టీలోని కురవృద్దుడు అయిన ఓ నాయకుడు నీచ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు.. బ్యాంకు నోటీసు నా వ్యక్తిగత అంశంగా పేర్కొన్న ఆయన.. నోటీసు ఎలా సమాధానం ఇవ్వాలో మా కంపెనీ చూసుకుంటుంది. రాజకీయంగా ఎదుర్కోలేక నాపై కుట్రలు పనుతున్నారని విమర్శించారు. మరోవైపు.. పల్లె రఘునాథరెడ్డి ఆస్తులను నేను ఏమీ తనఖా పెట్టలేదన్నారు శ్రీధర్‌రెడ్డి.. రఘునాథరెడ్డి వాళ్ల నాన్న ఏమైనా టా,టా బిర్లా నా? లేక అదానీనా..? లేకపోతే రిలయన్స్ బంధువులా..? అని ఎద్దేవా చేశారు. ఇక, రఘునాథరెడ్డి కాలేజీలో విద్యార్థులు లేక పోయినా ఎలాంటి మాయలు చేశాడో అందరికీ తెలుసన్నారు.. నేను అనుంటే పల్లె అక్రమాలపై విచారణ డిమాండ్ చేయవచ్చు.. కానీ, నేను అలాంటి రాజకీయాలు చేయబోన్నారు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి.

Exit mobile version