Site icon NTV Telugu

Putin: ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ షరతులు…!

Putin

Putin

గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. శాంతి చర్చల సమయంలో కూడా రెండు దేశాల సైన్యాలు వెనక్కితగ్గడం లేదు. అలాగే దాడులను కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపడానికి.. పుతిన్ తాజాగా అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ అందుకోసం పలు షరతును విధించినట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది.

READ MORE: Madhabi Puri Buch: సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. మార్కెట్ మోసం కేసులో క్లీన్‌చిట్

ఉక్రెయిన్ నాటోలో చేరడాన్ని పుతిన్ ముందు నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌ను నాటో నుంచి తెలగించాలని పుతిన్ షరతు పెట్టారు. ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు నాటో విస్తరణను నిలిపివేయడంపై ఆధారపడి ఉంటుందని రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారని నివేదిక తెలిపింది. నాటో తూర్పు వైపు విస్తరణను నిలిపివేస్తున్నట్లు వ్రాతపూర్వకంగా ఇవ్వాలని పుతిన్ డిమాండ్ చేశారు. దీని అర్థం ఉక్రెయిన్, జార్జియా, మోల్డోవా, ఇతర మాజీ సోవియట్ రిపబ్లిక్‌లకు నాటో సభ్యత్వం ఇవ్వ కూడదు.
అలాగే.. ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలని, ఆంక్షల ఎత్తివేత, స్తంభింపచేసిన రష్యన్ ఆస్తుల సమస్యకు పరిష్కారం, ఉక్రెయిన్‌లో రష్యన్ మాట్లాడేవారికి రక్షణ వంటి షరతులను పుతిన్ పెట్టారు.

READ MORE: NTR: నందమూరి తారకరామారావు ఒక అవతార పురుషుడు : మోహనకృష్ణ

మరోవైపు.. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతోన్న తరుణంలో పుతిన్‌ సేనలు విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్‌ ఈశాన్య సుమీ ప్రాంతంలోని నాలుగు సరిహద్దు గ్రామాలను మాస్కో సీజ్‌ చేసింది. ఈ నేపథ్యంలో రష్యా దండయాత్రను ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా కీలక ప్రతిపాదన చేశారు. ‘‘ద్వైపాక్షిక చర్చలకు పుతిన్‌ కు ఇష్టం లేకపోతే.. త్రైపాక్షిక చర్చలైనా ఫర్వాలేదు. ఏ తరహా సమావేశానికి అయినా నేను సిద్ధమే’’ అని జెలెన్‌స్కీ ప్రతిపాదించారు. తనతోపాటు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి చర్చల్లో పాల్గొనాలనే ఉద్దేశంలో ఆయన పిలుపునిచ్చారు. అలాగే శాంతి ఒప్పందానికి రాకుండా ముందుకు వెళ్తున్న రష్యాపై అమెరికా ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు.

Exit mobile version