Site icon NTV Telugu

Allu Arjun vs Rashmika: అప్పుడు ‘శ్రీవల్లి వైఫ్ ఆఫ్ పుష్పరాజ్’.. ఇప్పుడు ‘పుష్పరాజ్ వర్సెస్ శ్రీవల్లి’!

Pushpa Raj Vs Srivalli

Pushpa Raj Vs Srivalli

శ్రీవల్లి వైఫ్ ఆఫ్ పుష్పరాజ్.. అనేది పుష్ప సినిమాలో చూశాం. కానీ ఈసారి పుష్పరాజ్ వర్సెస్ శ్రీవల్లిగా చూడబోతున్నామనే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీతో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా బన్నీ కెరీర్లోనే కాదు.. ఇండియన్ సినిమా దగ్గర అత్యధిక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ వారు ఏకంగా 800 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో విజువల్ వండర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ల గురించి రోజుకో వార్త వైరల్ అవుతునే ఉంది. వాస్తవానికైతే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనేని ఫైనల్ చేశారు. కానీ ఇంకా మరో ముగ్గురు హీరోయిన్లు కూడా నటిస్తున్నట్టుగా టాక్ ఉంది. అందులో మృణాల ఠాకూర్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని అంటున్నారు. అలాగే దేవర బ్యూటీ జాన్వీ కపూర్ కూడా నటించనుందనే టాక్ ఉంది. ఇక లేటెస్ట్‌గా మరోసారి పుష్ప కాంబినేషన్‌ను రిపీట్ చేస్తున్నట్టుగా ఓ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం రష్మిక మందన్నను తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Also Read: Shubman Gill: శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. టీమిండియా తొలి కెప్టెన్‌గా..!

అయితే రష్మికది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదట. ఆమె ఈసారి నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి. అంతేకాదు కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లలో కూడా రష్మిక కనిపిస్తారని, అందుకోసం ఆమె ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకోనున్నారని టాక్‌. ఒకవేళ ఇదే నిజమైతే ఈసారి పుష్పరాజ్ వర్సెస్ శ్రీవల్లి ఫైట్ మామూలుగా ఉండదనే చెప్పాలి. మరి అట్లీ ఎలా ప్లాన్ చేస్తున్నాడు?.. ఈ సినిమాలో దీపికతో పాటు రష్మిక, జాన్వీ, మృణాల్ కూడా ఫైనల్ అయ్యారా? అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.

Exit mobile version