NTV Telugu Site icon

Pushpa Movie: పుష్ప 2 కోసం వెయిట్ చేస్తుంటే 1 మళ్లీ వచ్చేలా ఉంది..

Pushpa

Pushpa

Pushpa Movie: స్టైలిష్ స్టార్‌గా సౌత్‌లో పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌గా పాన్ ఇండియా మార్కెట్‌లో నిలబెట్టిన సినిమా పుష్ప ది రైజ్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలోని హీరో మేనరిజమ్స్ ని సెలబ్రిటిల నుంచి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యారు. ఇండియా వైడ్ 350 కోట్లకి పైగా గ్రాస్‌ని రాబట్టిన పుష్ప ది రైజ్ కి సీక్వెల్ గా పుష్ప ది రూల్ సినిమా ఉంటుందని సుకుమార్ స్టార్టింగ్‌లోనే అనౌన్స్ చేశాడు. పుష్ప ది రూల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? సినిమా అప్డేట్స్ ఏంటి? అంటూ అల్లు అర్జున్ ఫాన్స్ రోజుకోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. రీసెంట్‌గా బన్నీ ఫ్యా్న్స్ ఏకంగా గీత ఆర్ట్స్ ఆఫీస్ ముందే పుష్ప 2 అప్డేట్ కావాలి అంటూ చిన్న సైజ్ ధర్నా కూడా చేశారు.

Mahesh Babu: బాధ నుంచి బయట పడడానికి ఎన్టీఆర్ బాటలో మహేశ్..

పుష్ప ఫస్ట్ పార్ట్ ఎవరూ ఊహించనంత హిట్ అవ్వడంతో, పార్ట్ 2 ఇంకా గ్రాండ్‌గా ప్లాన్ చేసిన సుకుమార్… ఇప్పట్లో పుష్ప 2 గురించి ఎలాంటి అప్డేట్ ఇచ్చేలా కనిపించట్లేదు. రీసెంట్‌గా అల్లు అర్జున్‌కి లుక్ టెస్ట్ చేశారు కానీ అక్కడి నుంచి ఎలాంటి ఫోటో బయటకి రాలేదు. దీంతో అభిమానులు వీ వాంట్ అప్డేట్ అంటూ రచ్చ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళలోని అల్లు అర్జున్ ఫాన్స్ కూడా పుష్ప 2 అప్డేట్ అడుగుతున్నారు. పార్ట్ 2 నుంచి అప్డేట్ వచ్చేలా లేదు కాబట్టి కనీసం పార్ట్ 1ని మళ్లీ థియేటర్స్ లో చూసి అయిన ఎంజాయ్ చేయాలనీ నిర్ణయించుకున్నారు. దీంతో పుష్ప పార్ట్ వన్ రిలీజ్ అయిన డిసెంబర్ 17న, ఈ సినిమాని రీరిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక చేసేదేమీ లేక ఇ4 ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్లు కేరళ వ్యాప్తంగా ‘పుష్ప’ను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్య హీరోల పుట్టిన రోజులకు వాళ్ల పాత చిత్రాలు, బ్లాక్ బస్టర్స్‌ను రీ రిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తోంది.. ఈ ట్రెండ్‌కి కొత్త దారి చూపిస్తూ… పుష్ప పార్ట్ 1 సినిమాని తెలుగు రాష్ట్రాల్లో కూడా రీరిలీజ్ చేస్తే ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.

Show comments