ప్రస్తుతం ఎక్కడ విన్నా ఒక్కటే మాట పుష్ప.. అల్లు అర్జున్ పుష్ప 2 కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.. గతంలో వచ్చిన పుష్ప కంటే ఇప్పుడు రాబోతున్న సీక్వెల్ పై కాస్త ఎక్కువ బజ్ ఉంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమా అంచనాలను పెంచగా.. మొన్న రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ మాత్రం రికార్డులను బ్రేక్ చేస్తుంది.. యూట్యూబ్ లో అరుదైన రికార్డును అందుకుంది..
ఈ ప్రాజెక్ట్‌ని ఆగస్ట్ 15న థియేట్రికల్ రిలీజ్‌కి రెడీ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్‌కి అరుదైన ప్రత్యేకతను అందుకోవడం విశేషం.. సాంగ్ విడుదలైన ఆరు భాషల్లో మొదటి 24 గంటల్లో దేశంలో అత్యధికంగా వీక్షించబడిన లిరికల్ పాటగా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ కంపోజిషన్ 40 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ ని సంపాదించుకుంది. మొత్తంగా 26.6 మిలియన్లు వ్యూస్ ను రాబట్టడం మామూలు విషయం కాదు..
ఐకాన్ స్టార్ అత్యంత ఖచ్చితత్వంతో హుక్ స్టెప్‌ని అందించిన ఈ పాటకు 1.27 మిలియన్ లైక్‌లు వచ్చాయి. అంతేకాదు 15 దేశాల్లో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు విజయ్ పోలాకి పాటకు సంబందించిన ప్రతి ఒక్కరికి ఇది మంచి బ్రేక్ ను ఇచ్చింది.. ఒక్క పాటకే ఇంత రెస్పాన్స్ వస్తే ఇక సినిమాకు ఎలా ఉంటుంది థియేటర్లు బద్దలవ్వడం పక్కా అని బన్నీ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు..