Site icon NTV Telugu

Puri Musings: నలుగురిలో నలిగిన ప్రతిసారీ ఇలా చేయండి.. గాయాలన్నీ మానుతాయి: పూరి

Puri Jagannadh Next

Puri Jagannadh Next

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో సరికొత్త టాపిక్ తీసుకొచ్చారు. ‘స్ట్రాంగ్‌ పీపుల్‌’ అనే దానిపై చక్కటి విశ్లేషణ చేశారు. నార్మల్‌ పీపుల్‌కీ స్ట్రాంగ్‌ పీపుల్‌కి మధ్య చాలా తేడా ఉంటుందని.. ఆ తేడాను వివరించారు.

READ MORE: Bail to Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్‌ మంజూరు.. ట్విస్ట్‌ ఏంటంటే..!

పూరి జగన్నాథ్ వివరణ ఆయన మాటల్లో నే.. నార్మల్‌ పీపుల్‌కీ స్ట్రాంగ్‌ పీపుల్‌కి మధ్య చాలా తేడా ఉంటుంది. స్ట్రాంగ్‌ పీపుల్‌ను క్లోజ్‌గా పరిశీలిస్తే.. వాళ్ల నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. స్ట్రాంగ్‌ పీపుల్‌ ఎప్పుడైన హర్ట్ అయితే.. గట్టిగా ఏడవరు. అన్యాయం జరిగిందని అరవరు. ఎవరితోనూ యుద్ధం చేయరు. జరిగిన దానికి ఎవరికీ ఏ సమాధానం చెప్పరు. కంప్లైంట్ చేయరు. వివరణ ఇవ్వరు. ఎక్కువ డ్రామా చేయరు. ఎవరి అటెన్షన్‌ కోసం ఎదురు చూడరు. ఎవరి మీద ఎలాంటి కోపం, ద్వేషం పెట్టుకోరు. రివేంజ్ తీసుకునే ఆలోచనలో అస్సలు ఉండరు. జరిగిన అన్యాయాన్ని, అవమానాన్ని, బాధను గుండెల్లో పెట్టుకుని నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్లిపోతారు.

READ MORE: Operation Sindoor: పాక్‌లో ధ్వంసమైన ప్రాంతాలివే.. ఉపగ్రహ చిత్రాలు విడుదల

కొన్నాళ్లు అందరికీ దూరంగా బతుకుతారు. అయితే, ఇదివరకు ఉన్న నమ్మకం మనుషులపై ఉండదు. ఇది వరకు ఉన్న కనెక్షన్ అందరితో ఉండదు. వ్యవస్థ మీద, సొసైటీ మీద అసహ్యం వేయొచ్చు. రిలేషన్స్‌పై విరక్తి కలగొచ్చు. అయినప్పటికీ.. అందరితో నవ్వుతూ మాట్లాడుతారు. అందరి పట్ల దయతో ఉంటారు. వాళ్ల కష్టాన్ని ఎవరితోనూ పంచుకోరు. అందరితో ఎప్పటిలాగే సరదాగా ఉంటారు. ఎవడో అన్యాయం చేశాడని ఇంకొకరికి అన్యాయం చేయరు. దుర్మార్గుడిని కలిసిన తర్వాత దుర్మార్గులుగా మారిపోరు. ఎప్పటిలాగే చిరునవ్వుతో నార్మల్‌గా ఉంటారు. కాకపోతే, ఇంతకుముందు కంటే మరింత కేర్‌ఫుల్‌గా ఉంటారు.

READ MORE: RK Roja: ప్రభుత్వంపై రోజా సంచలన వ్యాఖ్యలు..

పనికిరాని పనుల కోసం.. అనవసరమైన మనుషుల కోసం శక్తిని వృథా చేసుకోరు. ఇకపై ఏం చేసినా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. మళ్లీ ప్రేమించడానికి, స్నేహం చేయడానికి వందసార్లు ఆలోచిస్తారు. అందుకే జీవితంలో ఏం జరిగినా మన మంచికే అని ఎన్నో నేర్చుకోవాలి. ఎప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ధైర్యంగా ఉండండి. లోపల అన్నీ దాచుకుని, మౌనంగా నడుచుకుంటూ పోండి. నలుగురులో నలిగిన ప్రతిసారీ వెళ్లి ఒంటరిగా కూర్చోండి. అప్పుడే గాయాలన్నీ మానుతాయి. ప్రతి వెన్నుపోటు తర్వాత బలంగా తయారవుతారు.

Exit mobile version