Pawan Kalyan: మాస్ మహారాజాకు పవర్ ఫుల్ హిట్స్ ఇచ్చిన పవర్ స్టార్! ఎలాగో చూసేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర పూనకాలే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బద్రి’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ వంటి చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కాల్సిన మరో మూడు సినిమాలు కూడా ఉన్నాయి తెలుసా. అయితే ఆ సూపర్ హిట్ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా చేయలేదు. ఈ విషయాలను స్వయంగా పూరి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పవన్ వదులుకున్న రెండు చిత్రాలు.. రవితేజ దగ్గరికి వెళ్లి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్‌గా నిలిచాయని పూరి తెలిపారు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి, వాటి వెనక ఉన్న కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
- Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
- Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
- Smart TV: QLED డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ ఒక ఇంటర్య్యూలో మాట్లాడుతూ.. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి మూడు సినిమాల కథలను ముందుగా పవన్ కళ్యాణ్‌ను వినిపించినట్లు తెలిపారు. “పవన్ కల్యాణ్ గారికి ఈ కథలు చెప్పినప్పుడు ఆయన చాలా ఎంజాయ్ చేశారు. సబ్జెక్టులు బాగున్నాయి అన్నారు కానీ, ఎందుకో అప్పుడు అవి పట్టాలెక్కలేదు. ఆయన ఈ కథలను వద్దని అనలేదు, కానీ చేయలేదు” అని తెలిపారు. పవన్ కల్యాణ్ వదులుకున్న ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి కథలు రవితేజ వద్దకు వెళ్లాయని, అవి రవితేజ కెరీర్‌కు చాలా ఉపయోగపడ్డాయని అన్నారు. నిజానికి మాస్ మహారాజా రవితేజ స్టార్ కాకముందు నుంచి తనకు మంచి మిత్రుడని చెప్పారు. తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే రవితేజ కచ్చితంగా స్టార్ అవుతాడని నమ్మేవాడిని, ఆ టైంలోనే రవితేజకు తనతో సినిమా చేస్తానని చెప్పే వాడినని అన్నారు. కానీ రవితేజ తన మాటలు నమ్మలేదని, అయితే ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి కథలు రవితేజను ‘మాస్ మహారాజా’గా నిలబెట్టాయని గుర్తు చేశారు. ‘పోకిరి’ సినిమా విషయానికి వస్తే మహేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా టాలీవుడ్‌లో ప్రత్యేక సెన్సేషన్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
READ ALSO: AI Dating Trend: ఏఐతో డేటింగ్.. న్యూయార్క్‌లో సంచలనం సృష్టిస్తున్న ఏఐ కేప్!
తాజావార్తలు
-
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
-
Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
-
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
-
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!