Site icon NTV Telugu

Double iSmart Update: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.. ఈసారి ఇస్మార్ట్‌ మ్యాడ్‌నెస్‌!

Double Ismart

Double Ismart

Ram Pothineni’s Double iSmart Update on May 12: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని కథానాయకుడిగా వచ్చిన సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్’. 2019 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల నుంచి డబుల్‌ ఇస్మార్ట్‌కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. దాంతో సినిమా ఆగిపోయిందని సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది.

డబుల్‌ ఇస్మార్ట్ మూవీ గురించి అప్‌డేట్‌ ఇస్తున్నట్లు పూరి కనెక్ట్స్‌ తాజాగా సోషల్ మీడియాలో పేర్కొంది. డబుల్‌ ఇస్మార్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి అప్‌డేట్‌ ఇస్తున్నామని తెలిపింది. ఓ పోస్టర్ షేర్ చేసి.. ‘ఆదివారం (మే 11) ఉదయం 10.03 గంటలకు అప్‌డేట్‌ ఇస్తున్నాం. ఈసారి ఇస్మార్ట్‌ మ్యాడ్‌నెస్‌ డబుల్‌ ఇంపాక్ట్‌తో రానుంది’ అని పూరి కనెక్ట్స్‌ తన ఎక్స్‌లో పేర్కొంది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Gautam Gambhir: అలాంటి ఓనర్‌ ఉండటం నా అదృష్టం: గంభీర్‌

మనిషి మెదడుకి చిప్‌ పెట్టి మెమొరీని ట్రాన్స్‌ఫర్‌ చేసిన కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ఇస్మార్ట్‌ శంకర్. డబుల్ ఇస్మార్ట్‌లో రెండు చిప్‌లు ఉంటాయని టాక్‌. ఇస్మార్ట్ శంకర్ పాత్రకే రెండు చిప్‌లు ఉంటాయట. డబుల్‌ ఇస్మార్ట్‌లో సంజయ్‌దత్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇస్మార్ట్‌ శంకర్‌లో నభా నటేశ్‌, నిధి అగర్వాల్‌ నటించగా.. డబుల్‌ ఇస్మార్ట్‌లో ఇప్పటివరకూ హీరోయిన్‌ ఎవరన్నది తెలియరాలేదు. నిధి అగర్వాల్‌ నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Exit mobile version