NTV Telugu Site icon

Purandeswari: పంట నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి

Purandeshwari

Purandeshwari

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాన్ తో పంట నష్టపోయిన రైతాంగాన్నివెంటనే ఆదుకోవాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కోరారు. రైతులకు ఉదారంగా ఆర్ధిక సహకారం అందించాలి అని ఆమె తెలిపారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి.. ఉద్యానవన పంటల సాగుదారులకు వెంటనే ఆర్ధిక సహకారం మంజూరు చేయాలి అని ఏపీ బీజేపీ చీఫ్ డిమాండ్ చేశారు. అసైన్డ్ భూముల్లో సాగు చేసిన రైతాంగాన్ని కూడా ఆదుకోవాలి.. ఉద్యాన వన పంట రైతుల నష్టం వివరాలు ప్రభుత్వం తేల్చాలి అని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు.

Read Also: Balakrishna : బాలకృష్ణ – బాబీ మూవీపై క్రేజీ అప్డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కు పూనకాలే..

48 గంటల్లో పంట నష్టపోయిన ప్రాంతాలకు అధికారులు వెళ్లి నష్టం అంచనాలు వేయాలి అని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి చెప్పారు. అరటి రైతులు ప్రత్యేకంగా రాయలసీమ జిల్లాల్లో నష్ట పోయారు.. మొత్తం ఉద్యానవన పంట సాగు రైతాంగాన్ని ఆదుకోవాలంటే వెంటనే పంటనష్టం అంచనాలు రెండు రోజుల్లో పూర్తి చేయాలి అని ఆమె కోరారు. పునరావస కేంద్రాల్లో ఉన్న వారికి నాణ్యమైన భోజన అందించాలి.. తుఫాన్ కారణంగా ఆయా ప్రాంతాల్లో ఆరోగ్య పరమైన రక్షణ చర్యలు చేపట్టాలి.. బీజేపీ శ్రేణులు సేవా రంగానికి పెట్టింది పేరు అదే విధంగా ప్రస్తుతం తుఫాన్ బాధితులకు సహకారం అందించాలని పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు.

Show comments