Site icon NTV Telugu

Punjab vs Mumbai: సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్ వృధా.. ఉత్కంఠ పోరులో పంజాబ్ ఒక్క పరుగుతో విజయం..!

Punjab Vs Mumbai

Punjab Vs Mumbai

Punjab vs Mumbai: జైపూర్ వేదికగా విజయ్ హజారే ట్రోఫీ 2025–26లో భాగంగా జరిగిన ఎలైట్ గ్రూప్ C మ్యాచ్‌లో పంజాబ్, ముంబై మధ్య హోరాహోరీగా సాగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కేవలం ఒక్క పరుగుతో ముంబైపై సంచలన విజయం సాధించింది.

Pizza Making At Home: డామినోస్ స్టైల్ చికెన్ పిజ్జా ఇంట్లోనే.. ఓవెన్ లేకపోయినా పర్ఫెక్ట్ గా ఇలా చేసేయండి..!

మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 45.1 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. జట్టులో రమందీప్ సింగ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతను 74 బంతుల్లో 72 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. అతనికి తోడుగా అన్మోల్ ప్రీత్ సింగ్ కూడా 57 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోయినా చివరి వరకూ పోరాడి పంజాబ్ 216 పరుగులు సాధించింది. ఇక ముంబై బౌలర్లలో ముషీర్ ఖాన్ 3 వికెట్లు.. శివమ్ దూబే, ఓంకార్ టర్మలే, శశాంక్ అట్టార్డే 2 వికెట్లు, సాయిరాజ్ పాటిల్ ఒక వికెట్ తీశారు.

Poco M8 5G Launch: 5,520mah బ్యాటరీ, 50MP కెమెరా.. పోకో ఎం8 5జీ వచ్చేసింది, 7వేల డిస్కౌంట్!

ఇక 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై బ్యాటింగ్ ఆరంభంలో మ్యాచ్ వన్ సైడ్ లా అనిపించింది. దీనికి కారణం సర్ఫరాజ్ ఖాన్. అతను విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. కేవలం 20 బంతుల్లోనే 62 పరుగులు (7 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతనికి తోడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 45 పరుగులు చేయగా, ముంబై విజయానికి చేరువైంది. 191 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయిన ముంబై ఆ తర్వాత కేవలం 25 పరుగుల తేడాతో మిగితా 5 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ను కోల్పోవాల్సి వచ్చింది.

కీలక దశలో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. గర్నూర్ బ్రార్ 4 కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. దీనితో ముంబై కేవలం 26.2 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌట్ కాగా ఒక్క పరుగుతో పంజాబ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసిన గర్నూర్ బ్రార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Exit mobile version