ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా కాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), పంజాబ్ కింగ్స్(Punjab kings) పోటీపడనున్నాయి. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతోంది. కాగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మంచి ఫాంలో ఉంది. ఇప్పటికే ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడి7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ప్లేఆఫ్స్‌కు సైతం చేరుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి కోల్‌కతాతో జరిగే మరో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓడిపోతే ఎస్‌ఆర్‌హెచ్ రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్ తొలగింది. పాయింట్ల పట్టికలో ఎస్‌ఆర్‌హెచ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ సీజన్‌లో అభిమానుల మద్దతు అద్భుతంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మేం తొలుత ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. పిచ్ పరిస్థితిని అంచనా వేయడంలో గొప్పేమీ కాదు. ఇప్పుడు చాలా బాగుంది. మంచి మ్యాచ్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నాడు.
READ MORE: Actor Chandu: కరాటే కళ్యాణితో నటుడు చందు చివరి వాట్సప్ ఛాట్!!!
జట్లు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్(w), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్(సి), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అథర్వ తైడే, రిలీ రోసౌవ్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ(w/c), అశుతోష్ శర్మ, శివమ్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్