Actor Chandu Whatsapp Chat With karate Kalyani Goes Viral: నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత ఆమెతో సహజీవనం చేస్తున్న చందు అనే నటుడు కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం తెలుగు టెలివిజన్ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. త్రినయని అనే సీరియల్లో అక్కా తమ్ముళ్లగా నటించిన వీరిద్దరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో జీ తెలుగు సీరియల్ టీమ్ అంతా షాక్ అయింది. నిజానికి పవిత్ర జయరాం కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. అదే కారులో ప్రయాణిస్తున్న చందు స్వల్ప గాయాలతో బయటపడి పవిత్రను మరిచిపోలేక రోజుల వ్యవధిలోనే ఉరివేసుకొని చనిపోయాడు. అయితే చందు చివరి వాట్సాప్ చాట్ అంటూ ఒక చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ చాట్ చేసింది మరెవరో కాదు సీరియల్స్ తో పాటు సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్న కరాటే కళ్యాణి.
Rashmi Gautam: ట్రెండీ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న రష్మీ గౌతమ్..
అయితే ఆ చాట్ లో ఏముందంటే ముందుగా చందు నేను వెళ్ళిపోతాను ఈ జన్మకు ఇక చాలు కానీ అప్పుడే ఎవరికీ చెప్పకండి అనడంతో అలా మాట్లాడొద్దని కరాటే కళ్యాణి పేర్కొంది. అయితే నేను వెళ్ళిపోతేనే కరెక్ట్ లేదంటే పిచ్చోడిని అయిపోతా లేదా తాగుబోతుని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాను అంటూ ఏడుస్తున్న ఎమోజి షేర్ చేశాడు. దానికి వద్దు మేమంతా లేమా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు మనం కలిసి పని చేశాం, నువ్వు నాకు బాగా తెలుసు అంటూ ఆమె ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. అయినా సరే చందు ఆత్మహత్య చేసుకుని మరణించడం ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా హార్ట్ టాపిక్ అవుతోంది. ఇక చందు మృతి పట్ల నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది అసలైన ప్రేమంటే ఇదే కదా అని కామెంట్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం 11 ఏళ్ల పాటు ప్రేమించిన భార్యని పవిత్ర కోసం వదిలేశాడు ఇతనేం భర్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు.