NTV Telugu Site icon

PBKS vs DC: టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

Pbks Vs Dc

Pbks Vs Dc

PBKS vs DC: ఐపీఎల్‌ 17 సీజన్‌లో భాగంగా పంజాబ్‌, ఢిల్లీ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరుగుతోంది. ఢిల్లీతో మ్యాచ్‌లో పంజాబ్‌ టాస్‌ నెగ్గింది. కెప్టెన్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ జట్టు మొదట బ్యాట్‌తో బరిలోకి దిగనుంది. చాలా కాలం తర్వాత మైదానంలోకి అడుగుపెడుతున్న రిషబ్ పంత్‌ పైనే అందరి దృష్టి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్ 454 రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి రానున్నాడు. అదే సమయంలో టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు మేనేజ్‌మెంట్‌ దృష్టి అతడిపైనే ఉంటుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (w/c), రికీ భుయ్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్ (సి), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (w), హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, శశాంక్ సింగ్