IPL 2023 : కష్టాల్లో పంజాబ్ కింగ్స్.. వరుస వికెట్లతో విలవిల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ మొహాలీ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో చెలరేగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ మాత్రం కష్టాల్లో పడింది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ అథర్వ టైడే ఇన్సింగ్స్ తొలి బంతికే ఫోర్ కొట్టి మంచి ఊపుమీద కనిపించాడు. ఇక రెండో బంతికి ఇన్‌స్వింగర్ వేసిన ఆర్సీబీ బౌలర్ సిరాజ్.. పంజాబ్ బ్యాటర్ అథర్వ టైడేను బోల్తా కొట్టించాడు. దీంతో అథర్వ టైడే ఎల్బీడబ్య్లూగా వెనుదిరిగిపోయాడు. దీంతో 4 పరుగులకే తొలి వికెట్ ను కోల్పోయింది.
Also Read : Volodymyr Zelensky: ఇదే సమయం.. మమల్ని కూడా “నాటో”లో చేర్చుకోండి…
Also Read
ఇక ఫస్ట్ ప్లేస్ లో బ్యాటింగ్ కు వచ్చిన మాథ్యూ షార్ట్ ను హసరంగ తన గూగ్లీ బౌలింగ్ తో ఔట్ చేయడంతో 27 పరుగులకే 2 రెండు వికెట్లను కోల్పోయింది పంజాబ్ కింగ్స్ టీమ్. పంజాబ్ స్టార్ బ్యాటర్ లివింగ్ స్టోన్ బ్యాటింగ్ కు వచ్చాడు. అతను కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. లివింగ్ స్టోన్ ను సిరాజ్ ఎల్బీడబ్య్లూగా పెవిలియన్ కు పంపించాడు. దీంతో పంజాబ్ జట్టు 4 ఓవర్లలోనే కీలకమైన మూడు వికెట్స్ నష్టపోయింది. 32 పరుగులకే 3 వికెట్లు నష్టపోయిన పంజాబ్ కింగ్స్ కష్టాల్లో పడింది. విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్ లో 49 పరుగుల వద్ద నాలుగవ వికెట్ గా హర్‌ప్రీత్ సింగ్ భాటియా రన్ అవుట్ రూపంలో ఔట్ అయ్యాడు. 77 పరుగుల వద్ద సామ్ కర్రన్ కూడా రన్ అవుట్ అయ్యాడు. దీంతో పంజాబ్ కింగ్స్ గెలుపుపై ఆశలు వదులుకుంది.
Also Read : Karnataka Elections: ఈపీఎస్ వర్సెస్ ఓపీఎస్.. పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటించిన అన్నాడీఎంకే
పంజాబ్ కింగ్స్ బ్యాటర్లను కోలుకోలేని విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్స్ దెబ్బమీద దెబ్బ కొట్టడంతో వరుస వికెట్లు కోల్పోయింది. దీంతో ఓపెనర్ ప్రభసిమ్రన్ ని పార్నెల్ ఔట్ చేయడంతో పంజాబ్ కింగ్స్ ఆరో వికెట్ కోల్పోయింది. అయితే పంజాబ్ కింగ్స్ జట్టును ఆదుకునేందుకు ప్రభసిమ్రన్ కష్టపడిన అతనికి మరోవైపు నుంచి సాయం చేసేవాళ్లు లేకుండా పోయారు. ప్రభసిమ్రన్ సింగ్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 46 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఇక షారుఖ్ ఖాన్ సైతం (7) తక్కువ స్కోర్ కే అవుట్ కావడంతో 137/7 తో పంజాబ్ కింగ్స్ ఇన్సింగ్స్ కొనసాగుతుంది. ప్రస్తుతం క్రీజులో జితేశ్ శర్మ ( 36 ), హర్ ప్రీత్ బార్ ( 8 ) బ్యాటింగ్ చేస్తున్నారు.

పంజాబ్ కింగ్స్ మరో వికెట్ ను కోల్పోయింది. దీంతో 147 పరుగులకే ఎనిమిది వికెట్లను చేజార్చుకుంది. హర్ ప్రీత్ బార్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 12 బంతుల్లో 26 పరుగులు సాధించాలి మరో ఎండ్ నుంచి జితేశ్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ తో మెరుపులు మెరిపిస్తుండగా.. తొమ్మిదో వికెట్ గా నాథన్ ఎల్లిస్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌల్డ్ చేయడంతో ఎల్లిస్ ఔట్ అయ్యాడు. 149 పరుగులకే 9 వికెట్లను పంజాబ్ కింగ్స్ కోల్పోయింది. జితేశ్ శర్మ ఔట్ కావడంతో 150 పరుగులకు పజాబ్ కింగ్స్ ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తాజావార్తలు
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. నేడు ఒక్కరోజే రూ.4 లక్షల కోట్లకు పైగా ఆవిరి..
-
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
-
Harish Rao : హరీశ్ వర్సెస్ కాంగ్రెస్.. ఇక కోర్టులోనే.!
-
SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!