Punjab: పోలీస్ స్టేషన్లో అవినీతికి వ్యతిరేకంగా రోడ్డుపై అడ్డంగా పడుకున్న హోంగార్డు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab: పంజాబ్‌లోని జలంధర్‌లోని హైవేపై ఓ పోలీసు హఠాత్తుగా పడుకున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడో చుట్టుపక్కల వారికి అర్థం కాలేదు. తన సొంత పోలీస్ స్టేషన్లోనే అవినీతికి వ్యతిరేకంగా ఆ పోలీసు నిరసన తెలిపాడు. నేరాల నిరోధించాల్సిన పోలీసులే నిందుతుల వంతుపాడుతూ వారికి మద్దతు పలుకుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే రోడ్డుపై పడుకున్నాడని తెలుస్తోంది. ఇలాంటి నిరసనను చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఆ రోడ్డుపై చాలా సేపటివరకు ట్రాఫిక్ జామ్ అయింది.
పోలీసుల నిరసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో, ‘నేను దొంగలను పట్టుకుంటాను, నా పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు డబ్బు తీసుకున్న తర్వాత వారిని విడిచిపెడతారు’ అని పోలీసు చెప్పడం కనిపిస్తుంది. వీడియోలో పోలీసు అతన్ని రోడ్డుపై తన్నడం కనిపిస్తుంది. పోలీసులు ఆ వ్యక్తి ఆరోపణలను తోసిపుచ్చారు. అతను తన్నలేదని కూడా పేర్కొన్నారు. ఈ ఘటన జలంధర్‌లోని భోగ్పూర్ ప్రాంతంలోని పఠాన్‌కోట్ హైవేపై జరిగింది. హోంగార్డు జవాన్లు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి భోగ్పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతను నిన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఆ వ్యక్తి గురించి అడగగా, తోటి పోలీసులు తప్పించుకునే సమాధానాలు చెప్పారు.
Also Read
- World Hello Day 2026 : ఒక్క 'హలో'తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
- Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
- Ind Vs Nepal: నేపాల్‌పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
Read Also:Sunday Stotram: ఈ స్తోత్రాలు వింటే మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉండవు
‘Jehra mai chor fad ke liauna oh Thane Wale paise laike chadi jande’
रिश्वतखोरी से दुखी हो कर पुलिस मुलाजिम ने #jalandhar के भोगपुर में रोड जाम कर विरोध प्रदर्शन किया। #PunjabPolice pic.twitter.com/QyajO37Cvd— Harpinder Singh (@HarpinderTohra) July 22, 2023
హోంగార్డు జవాన్ హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. వీడియోలో అతను వాహనాలను ఆపుతున్న దృశ్యం. ట్రాఫిక్‌ను ఆపేందుకు నాలుగు లేన్లలో తాడు కట్టేస్తున్నాడు. తోటి పోలీసు అతన్ని తిడుతూ తాడు విప్పుతున్నాడు. నిరసన వ్యక్తం చేస్తున్న వ్యక్తి బస్సు ముందు పడుకున్నాడు. ఆ వ్యక్తితో మరో పోలీసు వాగ్వాదానికి దిగాడు. అతడిని ఎత్తుకోవడానికి ప్రయత్నించి తన్నడం కనిపించింది. హోంగార్డు జవాన్ వెనక్కి వెళ్లేందుకు నిరాకరించాడు. బస్సు అతనిని దాటడానికి ప్రయత్నించినప్పుడు, అతను లేచి మళ్ళీ దాని ముందు పడుకున్నాడు.
భోగ్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి సుఖ్జిత్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఒక గొడవకు సంబంధించి ఓ యువకుడిని హోంగార్డు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చాడు. ఆ వ్యక్తి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు, అది మంజూరు చేయబడింది. దీని తర్వాత అతను విడుదలయ్యాడు. హోంగార్డు జవాన్‌ను తన్నడం లేదని సుఖ్జిత్ సింగ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!