MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కాయి. తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్న వైసీపీ.. న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ క్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం (ఈసీ)కు కూడా ఫిర్యాదు చేశారు. పుంగనూరులో చోటుచేసుకున్న పరిణామాలపై హైకోర్టును ఆశ్రయించినట్లు ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘మా అభ్యర్థుల నామినేషన్లు అధికారులు తీసుకోవడం లేదు. మా అభ్యర్థులను భయపెట్టేలా కేసులు పెడుతున్నారు. అందుకే హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశాం. హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. మేం నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. పుంగనూరు, రాయచోటిలో మేం గెలుస్తామనే ఇబ్బందులు పెడుతున్నారు. నాపైనే దాడులు చేసి, నాపైనే కేసులు పెట్టారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కూటమి గెలిచే పరిస్థితి లేదు’ అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలని, నామినేషన్లు సమర్పించేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని ఆయన కోర్టును కోరారు.
Also Read
- LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..?
- Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. కానీ తీవ్ర నిరాశ..!
- Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
- AB de Villiers: "కోహ్లీ ఓవర్కాన్ఫిడెన్స్, అహంకారిలా కనిపించాడు".. విరాట్ శైలిపై ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పుంగనూరు పట్టణానికి రావొద్దంటూ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. నామినేషన్ల సమయంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్న నేపథ్యంలో ఈ నోటీసులు కూడా రాజకీయ చర్చకు దారితీశాయి. పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానానికి చేరడంతో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. హైకోర్టు ఈ పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు వెలువడతాయన్నది కీలకంగా మారింది.
తాజావార్తలు
-
MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!
-
LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..?
-
Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. కానీ తీవ్ర నిరాశ..!
-
Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
-
AB de Villiers: “కోహ్లీ ఓవర్కాన్ఫిడెన్స్, అహంకారిలా కనిపించాడు”.. విరాట్ శైలిపై ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!