పూణేలో 22 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ పై జరిగిన అత్యాచారం కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి అపరిచితుడు కాదని, ఆ మహిళకు తెలిసిన వ్యక్తే అని పోలీసులు వెల్లడించారు. అత్యాచారం అనంతరం నిందితుడు తన ఫోన్‌లో సెల్ఫీ తీసుకున్నాడని యువతి పోలీసులకు చెప్పిన విషయం తెలిసిందే. దాన్ని సాక్ష్యంగా చూపించేందుకు ఆమె సెల్ఫీ స్వయంగా తీసుకుందని తేలింది. నిందితుడు తన ఫోన్‌లో మళ్లీ వస్తా అని మెసేజ్ టైప్ చేసి ఉంచడం కూడా కల్పితమని పోలీసులు బట్టబయలు చేశారు. పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. “వారు రెండు సంవత్సరాలుగా ఒకరికిఒకరు తెలుసు. ఇద్దరూ వర్గానికి చెందినవారు. ఆ సెల్ఫీని ఆ మహిళ స్వయంగా తీసుకుంది. ఆమె ఫోన్‌లో బెదిరింపు సందేశాన్ని కూడా టైప్ చేసింది” అని అన్నారు.
READ MORE: Pakistan-Russia: భారత్‌కు షాక్.. పాకిస్తాన్-రష్యా మధ్య కీలక ఒప్పందం..
బుధవారం సాయంత్రం కొంధ్వాలోని తన ఫ్లాట్‌లోకి డెలివరీ బాయ్‌నని చెప్పుకొని ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు ఒంటరిగా ఉన్న యువతి (22)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. రసాయన స్ప్రే సైతం కొట్టాడని ఆరోపించింది. బాధితురాలి ఫోన్‌తోనే అతడు సెల్ఫీ దిగి.. ‘నేను మళ్లీ వస్తా’అంటూ బెదిరింపు సందేశాన్ని ఫోన్‌లో ఉంచాడని బాధితురాలు చెప్పింది. అయితే.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అసలు విషయం బయటపడింది. కమిషనర్ మాట్లాడుతూ.. “ఎటువంటి రసాయన స్ప్రే ఉపయోగించలేదు. ప్రస్తుతం బాలిక మానసిక స్థితి బాగా లేదు. ఈ కేసును ఇంకా దర్యాప్తు చేస్తున్నాం.” అని వెల్లడించారు. కాగా.. ఆ యువతి కళ్యాణినగర్‌లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. 2022 నుంచి తన తమ్ముడితో కలిసి అద్దె ఫ్లాట్‌లో నివసిస్తోంది. ఈ ఘటన జరిగిన రోజు ఆమె సోదరుడు ఇంట్లో లేడు.
