పూణె సిటీలో పోర్షే కారు ఢీకొట్టగా మోటోసైకిల్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను చంపిన మైనర్ నిందితుడి తాతను పూణే పోలీస్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ శనివారం ఉదయం అరెస్టు చేసింది. నిందితుడి తాతను అరెస్టు చేసినట్లు పుణె నగర పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. అతనిపై ఐపీసీ సెక్షన్లు 365, 368 కింద ప్రత్యేక ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పూణేలోని కయానీ నగర్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి 17 ఏళ్ల తాతయ్యను పూణె సిటీ పోలీసులు గురువారం ప్రశ్నించారు. నిందితుడు యువకుడు మద్యం మత్తులో లగ్జరీ కారు నడుపుతూ అనీష్ అవధియా, అశ్విని కోష్ట అనే ఇద్దరు ఐటీ నిపుణులను ఢీకొట్టాడు.
Special casual leave: రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మే 27న ప్రత్యేక క్యాజువల్ సెలవులు..
కుటుంబ డ్రైవర్ గంగాధర్ ఫిర్యాదు మేరకు నిందితుడి తాత సురేంద్ర కుమార్ అగర్వాల్‌తో పాటు అతని కుమారుడు విశాల్ అగర్వాల్ పై కూడా ఇదే ఎఫ్‌ఐఆర్‌లో 342,365, 368, 506, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పూణే పోలీస్ సీపీ తెలిపారు. మే 19వ తేదీ రాత్రి ఎరవాడ పోలీస్ స్టేషన్ నుంచి గంగాధర్ వెళ్లే సమయంలో తన ఇష్టం లేకుండా సురేంద్ర ఇంటికి తీసుకెళ్లాడని డ్రైవర్ గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సురేంద్ర, అతని కుమారుడు విశాల్ గంగాధర్‌ను బెదిరించి అతని ఫోన్ లాక్కొని, అతని మైనర్ మనవడికి బదులుగా నేరానికి బాధ్యత వహించాలని బలవంతం చేసే ప్రయత్నంలో అతనిని బలవంతంగా తమ బంగ్లాలో బంధించారని తెలిపారు.
Thief Arrested: దొంగ నుండి 45 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు..
జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాల మేరకు నిందితుడిని అబ్జర్వేషన్ హోమ్లో ఉంచారు. ఈ కేసులో ఆయనకు గతంలో బెయిల్ లభించినప్పటికీ., జూన్ 5 వరకు 14 రోజుల పాటు అబ్జర్వేషన్ హోమ్‌కు పంపారు. నిందితుడు యువకుడి తండ్రి విశాల్ అగర్వాల్ ను గతంలో అరెస్టు చేసి 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించి ఎరవాడ సెంట్రల్ జైలులో ఉంచారు. మైనర్ నిందితుడిని విచారించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పూణే పోలీస్ కమిషనర్ గతంలో తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత పోర్స్చే కారును నడుపుతున్న వ్యక్తిని ఇరికించే ప్రయత్నం జరిగిందని ఆయన ధృవీకరించారు. ఇక పోలీసులు అతని వాంగ్మూలాన్ని పరిశీలిస్తున్నారని తెలిపారు.