Site icon NTV Telugu

Pulwama Terror Attack: పుల్వామా ఉగ్రదాడి నిందితుడు మృతి!

Pulwama Terror Attack

Pulwama Terror Attack

పుల్వామా ఉగ్రదాడి నిందితుడు బిలాల్‌ అహ్మద్‌ కుచేయ్ గుండెపోటుతో మృతి చెందాడు. 32 ఏళ్ల బిలాల్‌ జమ్మూకశ్మీర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. ఐదేళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడి ఘటనలోని 18 మంది నిందితుల్లో బిలాల్‌ ఒకడు.

బిలాల్‌ అహ్మద్‌ కుచేయ్.. జమ్మూకశ్మీర్‌ కాకాపోరాలోని హజీబల్ గ్రామానికి చెందినవాడు. పుల్వామా సీఆర్పీఎఫ్‌ జవాన్ల మృతికి సంబంధించిన కేసులో బిలాల్‌ ప్రస్తుతం జైల్లు శిక్ష అనుభవిస్తున్నాడు. సెప్టెంబరు 17న అతడు తీవ్ర అనారోగ్యంకు గురి కాగా.. జైలు అధికారులు జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో బిలాల్‌కు గుండెపోటు కూడా వచ్చింది. బిలాల్‌ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.

Also Read: Tata Nexon iCNG: ‘నెక్సాన్‌ ఐసీఎన్‌జీ’ లాంచ్‌.. 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, 24 కిలోమీటర్ల ప్రయాణం!

2019 ఫిబ్రవరి 14న పూల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగింది. అవంతిపొర సమీపంలో జరిగిన ఈ దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి 2020 ఆగస్టు 25న 18 మంది నిందితులపై ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఇందులో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరు పాకిస్థానీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లు అభియోగాలు ఉన్నాయి. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుల్లో బిలాల్‌ అహ్మద్‌ కుచేయ్ ఒకడు.

Exit mobile version