Site icon NTV Telugu

Pulivendula Byelection: దాడులతో దద్దరిల్లిపోయిన పులివెందుల.. కాసేపట్లో మైకులు బంద్..!

Pulivendula

Pulivendula

Pulivendula-Byelection: మరి కాసేపట్లో ఉప ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది.. గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారం కాకరేపింది. గత వారం రోజులుగా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగింది. దాడులతో పులివెందుల దద్దరిల్లిపోయింది. అయినా వైసీపీ వెనకడుగు వేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మైకులు మారు మోగాయి. టీడీపీ, వైసీపీ మధ్య పోటా పోటీ ఎన్నికల ప్రచారం జరిగింది.. టీడీపీ తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచార రంగంలోకి దిగారు. పులివెందులలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత మఖాం వేశారు.. ఒంటిమిట్టలో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి తిష్ట వేశారు. వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ముమ్మర ప్రచారం నిర్వహించారు… కాగా.. మరి కాసేపట్లో మైకులు బంద్ కానున్నాయి.

READ MORE: Tollywood : ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం.. ఫెడరేషన్ వార్నింగ్..

మరోవైపు.. కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎలక్షన్ పై మాట్లాడారు. “12వ తారీకు పులివెందుల ఒంటిమిట్ట మండలంలో జడ్పీటీసీ ఎన్నికలు ఏర్పాట్లు పూర్తి చేశాం.. రెండు జడ్పీటీసీలకు 45 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం.. 15 పోలింగ్ స్టేషన్లో పులివెందులలో.. 30 పోలింగ్ స్టేషన్లు ఒంటిమిట్టలో ఏర్పాటు చేశాం.. 12వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం..12వ తేదీ ఎలక్షన్ ప్రక్రియ ఫిజికల్ బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తున్నాం.. ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం.. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు క్యాంపెయిన్ ప్రక్రియ ముగుస్తుంది.. ఇరు పార్టీలు ఏ పార్టీ అయినా సరే ఐదు లోపు ప్రచారం నిర్వహించుకోవచ్చు.. స్థానికేతులందరూ మండలం వదిలి వెళ్ళిపోవాలి.. సాయంత్రం ఐదు గంటల తరువాత నో క్యాంపెనింగ్ పిరియడ్.” అని కలెక్టర్ వ్యాఖ్యానించారు.

Exit mobile version