Pulivarthi Sudha Reddy: ఈ రోజు అంతా నీ వెంటే.. చెవిరెడ్డికి పులివర్తి సుధా రెడ్డి వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pulivarthi Sudha Reddy Warns Chevireddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి రూరల్ ప్రాంతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. టీడీపీ నేతలను రెచ్చగొట్టొద్దని, అనవసరంగా గొడవలు సృష్టించవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు అంతా నీ వెంటే ఉంటా అని, అప్పుడే ఎలాంటి గొడవలు జరగవు అని సుధా రెడ్డి అన్నారు.
వైసీపీ అభ్యర్థికి జనరల్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోలింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లారు. ఈ క్రమంలో ఉదయం మంగళం ప్రాంతంలోని పోలింగ్ కేంద్రం వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని చెవిరెడ్డి అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు టీడీపీ అభ్యర్థికి జనరల్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న పులివర్తి సుధా రెడ్డి.. చెవిరెడ్డి ఉన్న పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లారు. ఆయన కాన్వాయ్‌ను సుధారెడ్డి తన వాహనంతో వెంబడించారు. ఉదయం నుంచి చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే.. సుధా రెడ్డి అటే వెళ్లడం గమనార్హం.
Also Read
- భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
- Ramayana Twitter Review: ఫైట్స్ అదుర్స్.. రణబీర్, యాష్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ .. 'రామాయణం' ఫస్ట్ షోపై ఆడియన్స్ టాక్..
- AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. చెవిరెడ్డికి పులివర్తి సుధ వార్నింగ్!
- CCTV Cameras Offline:ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సీసీ కెమెరాల చిత్రం.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఆఫ్‌లైన్!
ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఉద్దేశించి పులివర్తి సుధా రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. టీడీపీ నేతలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. ‘నేను ఎస్కార్ట్.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వెంటే ఉంటా. ఈ రోజు అంతా నీ వెంటే ఉంటా. నిన్ను ఒంటరిగా వదిలేస్తే గొడవలు చేస్తావ్. నాన్సెన్స్ క్రియేట్ చేస్తే నీకు, నాకు డైరెక్ట్ ఉద్యమమే’ అంటూ చెవిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో తిరుపతి రూరల్ ప్రాంతంలో ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. సుధా రెడ్డి వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. చెవిరెడ్డికి పులివర్తి సుధ వార్నింగ్!
-
Pulivarthi Sudha Reddy: ఈ రోజు అంతా నీ వెంటే.. చెవిరెడ్డికి పులివర్తి సుధా రెడ్డి వార్నింగ్!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Ramayana Twitter Review: ఫైట్స్ అదుర్స్.. రణబీర్, యాష్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ .. ‘రామాయణం’ ఫస్ట్ షోపై ఆడియన్స్ టాక్..
-
CCTV Cameras Offline:ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సీసీ కెమెరాల చిత్రం.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఆఫ్‌లైన్!
ట్రెండింగ్
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!