NTV Telugu Site icon

SIT Investigation: దాడి ఘటనపై విచారణకు హాజరైన పులివర్తి నాని..అధికారులతో ఏం చెప్పారంటే?

New Project (5)

New Project (5)

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లో వర్శిటి జరిగిన దాడి ఘటనపై విచారణకు హాజరయ్యారు. అక్కడ ఆయన అధికారులతో మాట్లాడారు. “పద్మావతి వర్శిటిలో నాపై దాడికి కర్త, ఖర్మ, క్రియ మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. న్యాయం చేమాని పోలీసులను కోరాం. కుట్రతో చెవిరెడ్డి ఇలాంటి దాడులకు తెగపడడ్డారు. అనుచరులు చేజారకుండా కావాలనే ఆయన మనుషులపై కేసులు పెట్టించాడు. పోలీసులకు ఇవ్వాల్సిన ఆధారాలను ఇచ్చాను. అమాయకులను కేసులో ఇరికించారు. చంద్రగిరి ప్రశాంతంగా చూడటమే నాలక్ష్యం. రిపోలింగ్ చేస్తే… మాకే పోలింగ్ శాతం పెరుగుతుంది. ఎక్కడ గొడవలు జరగలేదు. కావాలని చెవిరెడ్డి రి పోలింగ్ అడిగినట్లు ఉన్నారు.” అని ఆయన పేర్కొన్నారు.

READ MORE: PM Modi: “నేను జీవించి ఉన్నంత వరకు అది సాధ్యం కాదు”.. రిజర్వేషన్లపై ప్రధాని మోడీ..

కాగా.. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు చంద్రగిరిలో అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఏపీ పోలింగ్‌ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. కేంద్ర బలగాలతో నారావారిపల్లి, శేషాపురం, భీమవరంలలో పోలీసులు మార్చ్ నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్ళల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలు ఎవరు కూడా గుమికూడరాదని హెచ్చరికలు జారీ చేశారు. సభలు, సమావేశాలు, ఊరేగింపులకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. జూన్ 4 వరకు ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.