ఎంతో ప్రశాంతంగా ఉండే చోటా కులాలు, మతాలు పేరుతో చెవిరెడ్డి భాస్కరెడ్డి చిచ్చు పెట్టారు అంటూ చంద్రగిరి టీడీపీ ఇన్ చార్జ్ పులివర్తి నాని పేర్కొన్నారు. రాడ్ తో, కర్రలతో నాపై దాడి చేస్తున్నారని సమాచారం ఇచ్చినా కూడా పోలీసులు సరైన విధంగా స్పందించ లేదు అంటూ ఆయన పేర్కొన్నారు. చంద్రగిరి ప్రజలు కోసం, నా పార్టీ కేడర్ కోసం చావడానికి సిద్దం అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ పులివర్తి నాని ఎమోషనల్ అయ్యారు.
Also read: DGP Harish Kumar: ఏపీలో పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై డీజీపీ వరుస రివ్యూలు..
చెవిరెడ్డి అరాచాలకు ఈ ఎన్నికలతో ముగింపు పడుతుందని., మీ కొట్టారు తీసుకున్నాం.. మా టైం వస్తుంది అప్పుడు మేము చూపిస్తాం.. ఎవరిని వదలిపెట్టాము.. అంటూ ఘాటుగా స్పందించారు. చంద్రగిరికి పులివెందుల సంస్కృతి తీసుకోవచ్చారని.. నాపై జరిగిన దాడి విడియోలు ఎవరు చూసినా చెబుతారు అని., ఎలా చంపాలని ప్లాన్ వేసారని.. జూన్ 5 తేదినా మేము ఎంటో కూడా చెబుతాం అంటూ వైస్సార్సీపీ నాయకులపై కాస్త ఘాటుగా స్పందించారు.
Also read: Nayanatara : భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన నయన్.. పిక్స్ వైరల్…