Site icon NTV Telugu

Mohsin Naqvi: పరువంతా పోయిందిగా మోహ్‌సిన్ నఖ్వీ.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటా అంటూ గరం గరం..

Mohsin Naqvi Trolls

Mohsin Naqvi Trolls

Mohsin Naqvi: పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026 సీజన్ ఆరంభంలోనే వివాదాలతో సాగుతోంది. లాహోర్‌ లోని గడాఫీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌ లో లాహోర్ క్వాలండర్స్ 69 పరుగుల తేడాతో హైదరాబాద్ కింగ్స్‌మెన్‌ పై విజయం సాధించారు. అయితే ఈ మ్యాచ్ కు స్టేడియంలో ప్రేక్షకులు లేకపోవడం చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ లో ఇంధన సంక్షోభం తీవ్రతరం కావడంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీని ప్రభావంగా ప్రారంభ వేడుకలు కూడా రద్దయ్యాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగుతుండటంతో ప్లేయర్లు, కామెంటేటర్లు కూడా PSL‌ను విడిచి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

GHMC: నేడు రాత్రి 8:30 నుంచి 9:30 వరకు లైట్లు ఆఫ్ చేయాలి.. ప్రజలకు జీహెచ్‌ఎంసీ పిలుపు..

ఈ పరిణామాలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు పెద్ద ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా బోర్డు చైర్మన్ ” మోహ్‌సిన్ నఖ్వీ” తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఐపీఎల్ కోసం పీఎస్‌ఎల్‌ ను వదిలి వెళ్లిన ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజార్బాని ఇస్లామాబాద్ యునైటెడ్ తో ప్రస్తుతం ఆడాల్సి ఉంది. అయితే అతను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో చేరేందుకు నిర్ణయం తీసుకున్నాడు. కాగా బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ కు ప్రత్యామ్నాయంగా అతను ఐపీఎల్‌లో చోటు సంపాదించాడు.

ఇదే తరహాలో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టులో గాయపడిన సామ్ కుర్రాన్‌ కు బదులుగా చేరనున్నాడు. అతను PSLలో లాహోర్ కలండర్స్ జట్టుకు ఎంపికయ్యాడు. అలాగే ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాథన్ ఎల్లిస్ కు బదులుగా తీసుకుంది. ముందుగా అతను క్వెట్టా గ్లాడియేటర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Hardik Pandya: యాటిట్యూడ్ మాత్రమే కాదు.. మంచి మనసు ఉందని నిరూపించిన హార్దిక్ పాండ్య..!

మరోవైపు ప్లేయర్లే కాకుండా కామెంటేటర్లు కూడా PSL‌ను వదిలి ఐపీఎల్ వైపు వెళ్తున్నట్లు సమాచారం. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నిక్ నైట్ మొదట PSL కామెంటరీ ప్యానెల్‌ లో చోటు దక్కించుకున్నప్పటికీ, ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ కామెంటరీ జట్టులో కూడా చేరాడు. చూడాలి మరి వీరిపై బోర్డు చైర్మన్ ” మోహ్‌సిన్ నఖ్వీ” ఎలాంటి చర్యలు తీసుకోనున్నాడో..

Exit mobile version