Mohsin Naqvi: పరువంతా పోయిందిగా మోహ్‌సిన్ నఖ్వీ.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటా అంటూ గరం గరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohsin Naqvi: పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026 సీజన్ ఆరంభంలోనే వివాదాలతో సాగుతోంది. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ లో లాహోర్ క్వాలండర్స్ 69 పరుగుల తేడాతో హైదరాబాద్ కింగ్స్‌మెన్ పై విజయం సాధించారు. అయితే ఈ మ్యాచ్ కు స్టేడియంలో ప్రేక్షకులు లేకపోవడం చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ లో ఇంధన సంక్షోభం తీవ్రతరం కావడంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీని ప్రభావంగా ప్రారంభ వేడుకలు కూడా రద్దయ్యాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగుతుండటంతో ప్లేయర్లు, కామెంటేటర్లు కూడా PSLను విడిచి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
GHMC: నేడు రాత్రి 8:30 నుంచి 9:30 వరకు లైట్లు ఆఫ్ చేయాలి.. ప్రజలకు జీహెచ్‌ఎంసీ పిలుపు..
Also Read
ఈ పరిణామాలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు పెద్ద ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా బోర్డు చైర్మన్ ” మోహ్‌సిన్ నఖ్వీ” తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఐపీఎల్ కోసం పీఎస్‌ఎల్ ను వదిలి వెళ్లిన ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజార్బాని ఇస్లామాబాద్ యునైటెడ్ తో ప్రస్తుతం ఆడాల్సి ఉంది. అయితే అతను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో చేరేందుకు నిర్ణయం తీసుకున్నాడు. కాగా బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ కు ప్రత్యామ్నాయంగా అతను ఐపీఎల్‌లో చోటు సంపాదించాడు.
ఇదే తరహాలో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టులో గాయపడిన సామ్ కుర్రాన్ కు బదులుగా చేరనున్నాడు. అతను PSLలో లాహోర్ కలండర్స్ జట్టుకు ఎంపికయ్యాడు. అలాగే ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాథన్ ఎల్లిస్ కు బదులుగా తీసుకుంది. ముందుగా అతను క్వెట్టా గ్లాడియేటర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
Hardik Pandya: యాటిట్యూడ్ మాత్రమే కాదు.. మంచి మనసు ఉందని నిరూపించిన హార్దిక్ పాండ్య..!
మరోవైపు ప్లేయర్లే కాకుండా కామెంటేటర్లు కూడా PSLను వదిలి ఐపీఎల్ వైపు వెళ్తున్నట్లు సమాచారం. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నిక్ నైట్ మొదట PSL కామెంటరీ ప్యానెల్ లో చోటు దక్కించుకున్నప్పటికీ, ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ కామెంటరీ జట్టులో కూడా చేరాడు. చూడాలి మరి వీరిపై బోర్డు చైర్మన్ ” మోహ్‌సిన్ నఖ్వీ” ఎలాంటి చర్యలు తీసుకోనున్నాడో..
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!