Site icon NTV Telugu

VHP Protests: హిందూ దేవుళ్లను అవమానించారంటూ మంగళూరులో వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నిరసనలు..

Protests

Protests

మంగళూరులో భజరంగ్ దళ్, వీహెచ్‌పీ సభ్యులు నిరసన చేపట్టారు. ఒక కాన్వెంట్ స్కూల్‌లో హిందూ దేవుళ్లను అవమానించడం, విద్యార్థులను మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారనే సమాచారంతో విద్యార్థులతో కలిసి మితవాద సంఘాలు నిరసనలు చేపట్టారు. కాథలిక్ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు.. హిందూ దేవుళ్లను అవమానించడం, హిందూ మతానికి వ్యతిరేకంగా విద్యార్థుల మనస్సులను విషపూరితం చేయడం, ఇతర మతాలకు చెందిన విద్యార్థులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి కుట్ర పన్నుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.

Bihar: బీహార్ కొత్త స్పీకర్‌గా నంద కిషోర్

దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిరసనలు వెల్లువెత్తాయి. మరోవైపు.. గోద్రా ఘటన, బిల్కిస్ బానోకు సంబంధించి విద్యార్థులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని.. ఇవి విద్యార్థుల మనస్సులలో కలవరపెట్టే విధంగా ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా.. రాముడు పౌరాణిక వ్యక్తి అని ఉపాధ్యాయుల్లో ఒకరు చెప్పారని తెలిపారు. దీంతో దక్షిణ కన్నడ బీజేపీ ఎమ్మెల్యే వేదవ్యాస్ కామత్, భజరంగ్ దళ్, వీహెచ్‌పీ సభ్యులతో కలిసి సోమవారం పాఠశాలకు చేరుకుని పాఠశాల యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు.

Harihara Veera Mallu: క్రిష్ తప్పుకున్నాడంటూ ప్రచారం.. కీలక ప్రకటన చేసిన టీం

మొత్తం సమాజాన్ని, హిందువులను మతం మారుస్తావా.. అని బీజేపీ ఎమ్మెల్యే పాఠశాల ఉపాధ్యాయుడిపై నిప్పులు చెరిగారు. మీరు పూజించే జీసస్ శాంతిని కోరుకుంటాడు. మీ సోదరీమణులు మా హిందూ పిల్లలు తిలకం, పువ్వులు పెట్టుకోవద్దని అంటున్నారు. రాముడిపై పాలు పోయడం వృధా అంటున్నారని మండిపడ్డారు. ఎవరైనా మా నమ్మకాన్ని అవమానిస్తే మేం ఊరుకోం.. మీ నమ్మకాన్ని ఎవరైనా అవమానిస్తే మీరు మౌనంగా ఉండరు కదా అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఘటనపై మంగళూరు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ (డిడిపిఐ) దృష్టి సారించి, విచారణ చేపట్టారు.

Exit mobile version