Site icon NTV Telugu

Pakistan: పాకిస్థాన్ హోంమంత్రి ఇంటిని తగులబెట్టిన ఆందోళనకారులు.. ఎందుకంటే?

Pak

Pak

పాకిస్థాన్‌ను ప్రస్తుతం అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టాయి. ఒక వైపు బలూచిస్థాన్‌లో అస్థిరత నెలకొంది. మరోవైపు సింధ్ ప్రావిన్స్ లో నిరసనలు తారా స్థాయికి చేరుకున్నాయి. పహల్గాం ఘటన తర్వాత సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. నీళ్లు లేకపోవడంతో పాక్‌ ప్రజలు ఎదురు తిరిగారు. తాజాగా పాక్‌ హోంమంత్రి జియా ఉల్‌ హసన్‌ ఇంటిని తగలబెట్టారు. నౌషాహ్రో ఫిరోజ్ జిల్లాలోని సింధ్ హోంమంత్రి జియావుల్ హసన్ లంజార్ నివాసంపై దాడి చేసి నిప్పంటించారు. ఆందోళనకారులు ఇళ్లలోని వస్తువులను తగులబెట్టి, ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ సమయంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు నిరసనకారులు మరణించారు. ఒక డీఎస్పీ, ఆరుగురు పోలీసులతో సహా డజనుకు పైగా ప్రజలు గాయపడ్డారు.

READ MORE: MI vs DC: మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్స్ లో నిలిచేదెవరో..? మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై ఇండియన్స్..!

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) నేతృత్వంలోని సింధ్ ప్రభుత్వానికి, కేంద్రంలోని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి మధ్య చోలిస్తాన్ కాలువ అంశం ప్రధాన వివాదానికి దారితీసింది. పాకిస్థాన్‌లోని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం చోలిస్తాన్ ఎడారికి సాగునీరు అందించడానికి సింధు నదిపై ఆరు కాలువలను నిర్మించాలని యోచిస్తోంది. కానీ సింధ్ ప్రావిన్స్‌లోని పీపీపీ, ఇతర రాజకీయ పార్టీలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయి. పాక్ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. చోలిస్తాన్ కాలువ వ్యవస్థ అంచనా వ్యయం రూ.211.4 బిలియన్లు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం వేల ఎకరాల బంజరు భూమిని సాగు భూమిగా మార్చడం. ఈ ప్రాజెక్టు కింద, 400,000 ఎకరాల భూమిని సాగు చేయవచ్చని అధికారులు ప్రణాళిక ద్వారా తెలిపారు. కానీ ఈ ప్రాజెక్టు సింధ్‌లోని రాజకీయ పార్టీలు, మత సంస్థలు, కార్యకర్తలు, న్యాయవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సింధ్ అంతటా ర్యాలీలు, నిరసనలు జరిగాయి. దీంతో గత నెలలో ఈ ప్రాజెక్టును కామన్ ఇంటరెస్ట్ కౌన్సిల్ (CCI) తిరస్కరించింది. సీసీఐ ప్రకటించినప్పటికీ సింధ్‌లో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి.

READ MORE: Asim Munir Promotion: పాక్ ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్ గా ప్రోమోషన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!

Exit mobile version