NTV Telugu Site icon

MLA Kannababu: ఎమ్మెల్యేకి నిరసన సెగ.. చేయి చేసుకున్న కన్నబాబు

Mla3

Mla3

యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు నిరసన సెగ ఎదురైంది. అచ్యుతాపురం(మం) పూడి మడక గడపగడపలో తోపులాట చోటుచేసుకుంది. ఆగ్రహంతో చెయ్యి చేసుకున్న ఎమ్మెల్యే కన్నబాబు వ్యవహారంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొంత కాలంగా ఎమ్మెల్యే వెర్సస్ లోకల్ లీడర్స్ ఫైట్ కొనసాగుతోంది. సొంత పార్టీలోనే ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తుంది ఓ వర్గం. పూడిమడక జెట్టీ నిర్మాణం కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ స్వంత నియోజకవర్గం నేతలు ఆయన పర్యటనల్ని అడ్డుకున్నారు.

Read Also:Taxs : మీ జేబులు ఖాళీ చేసే పన్నులు నేటి నుంచి ఏవేవి అమలవుతున్నాయో తెలుసా ?

ప్రభుత్వ పథకాల అమలు విషయంలో వివక్ష చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నబాబు వద్దు – జగనన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు. కన్నబాబు అరాచకాలు జగన్ వరకూ చేరాలని.. కన్నబాబు అరాచకాలు నశించాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. కన్నబాబు దందాలను అరికట్టాలని.. ఆయన అరాచకాలు అడ్డుకోవాలన్నారు. తప్పులు చేస్తారు.. చేయిస్తారంటూ ప్లకార్డులు తీసుకొచ్చి నిరసనకు దిగారు. వీరిలో సొంత పార్టీ నేతలు కూడా ఉన్నారు.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేను స్థానికులు మరోసారి అడ్డుకోవడం తాజాగా చర్చనీయాంశమైంది. రాబోయే ఎన్నికల్లో కన్నబాబు ఈ నిరసనల్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Read Also:PM Modi’s Roadshow: కర్ణాటక రోడ్ షోలో ప్రధాని పైకి మొబైల్ ఫోన్ విసిరిన మహిళ..

Show comments