NTV Telugu Site icon

Pathaan: పఠాన్ మూవీకి షాక్.. షారూఖ్ ఖాన్ దిష్టిబొమ్మ దహనం

Pathaan

Pathaan

protest against Pathaan movie in Indore: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటిస్తున్న ‘ పఠాన్’ మూవీకి నిరసన సెగ తగులుతోంది. మరో బాలీవుడ్ సినిమాకు ‘బాయ్ కాట్’ సెగ తగులుతోంది. ఈ సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని కొన్ని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాపై సీరియస్ గా ఉంది.

బాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ పఠాన్ చిక్కుల్లో ఇరుక్కుంది. ఇటీవల ఈ సినిమా నుంచి ‘బేషరమ్’ సాంగ్ విడుదల అయింది. ఈ పాటలో దీపికా పదుకొణె చాలా హాట్ గా బికినీలో నటించింది. అయితే దీనిపై రచ్చ మొదలైంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ అభ్యంతరకర సన్నివేశాలను తొలిగిస్తేనే సినిమాకు అనుమతి ఇస్తాం అని లేకుంటే నిషేధం తప్పదని హెచ్చరించారు. ఈ పాటలో దీపికా పడుకొణె కాషాయ రంగులో బికనీ ధరించి ఈ పాటలో కనిపిస్తుంది. ప్రస్తుతం దీనిపై రచ్చ కొనసాగుతోంది.

Read Also: S Jaishankar: ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన మీరా మాట్లాడేది..? పాక్ తీరుపై నిప్పులు

వీర్ శివాజీ గ్రూప్ కార్యకర్తలు ఇండోర్ నగరంలో పఠాన్ సినిమాకు వ్యతిరేకంగా బుధవారం నిరసన తెలిపారు. ఈ సినిమా హీరో షారూఖ్ ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బేషరమ్ రంగ్ పాటలో కంటెంట్ వల్ల హిందూ సమాజం మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆరోపించింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్లు మొదలయ్యాయి. గతంలో కూడా హిందూ సంస్కృతిని కించపరిచేలా సీన్లు ఉన్న పలు సినిమాలపై కూడా అభ్యంతరం తెలిపారు. హిందూ దేవీదేవతలను తప్పుగా చూపిస్తున్నారని రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమాపై నిర్మాతలను హెచ్చరించారు. తప్పును సరిదిద్దుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా పఠాన్ మూవీకి నిరసన తప్పడం లేదు. ఈ వివాదంపై సినిమా యూనిట్ ఇంకా ఏం స్పందించలేదు.