బీజేపీ సీనియర్ నేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పలువురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. ఖట్టర్ కర్నాల్‌లో మాట్లాడుతూ.. “ఎన్నికల సీజన్‌లో ఎవరు ఎక్కడికి వెళ్తున్నారనే దానిపై ఎటువంటి ప్రభావం ఉండదు. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్‌లో ఉన్నారు. ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు.” అని స్పష్టం చేశారు. మాతో చాలా మంది టచ్‌లో ఉన్నందున తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని విపక్షాలకు సవాల్ విసిరారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందు మార్చి నెలలో మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆయన కర్నాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.
READ MORE: Fake Aadhaar Cards: కేరళలో 50 వేల నకిలీ ఆధార్ కార్డులు.. కేంద్రాల్లో సృష్టిస్తున్నట్లు వెల్లడి
హర్యానాలో బీజేపీ ప్రభుత్వం కష్టాల్లో పడింది. నిన్నటి వరకు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీ మద్దతు పలికారు. అందులో మంగళవారం ముగ్గురు అభ్యర్థులు మద్దతులను ఉపసంహరించుకోవడంతో బీజేపీ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఏర్పడింది.తమ మద్దతు ఉపసంహరించుకున్న స్వతంత్ర ఎమ్మెల్యేలలో పుండ్రి ఎమ్మెల్యే రణధీర్ గోలన్, నీలోఖేలి ఎమ్మెల్యే ధరంపాల్ గోండార్, దాద్రీ శాసన సభ్యుడు సోంబీర్ సింగ్ సాంగ్వాన్ ఉన్నారు. ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. కాగా.. 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 40, కాంగ్రెస్‌కు 30, జననాయక్ జనతా పార్టీకి 10 సీట్లు వచ్చాయి. 2019 అక్టోబర్‌లో హర్యానాలో బీజేపీ-జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఏడాది మార్చిలో రెండు పార్టీలు విడిపోయాయి.