Site icon NTV Telugu

Bangladesh vs India: బెంగాల్లో మైనారిటీల హక్కులను కాపాడాలన్న బంగ్లా.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్

Ban

Ban

Bangladesh vs India: పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టంతో నెలకొన్న హింసపై బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ స్పందించారు. ఈ సందర్భంగా గత వారం బెంగాల్‌ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలో చెలరేగిన హింసలో ముగ్గురు మరణించగా, వందలాది మంది గాయపడిన మైనారిటీ ముస్లిం వర్గాలను రక్షించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఇక, బంగ్లాదేశ్ వ్యాఖ్యలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తోసిపుచ్చారు. ఇలాంటి “అనవసరమైన” వ్యాఖ్యలు చేయడం కంటే, తమ దేశంలోని మైనారిటీల హక్కులను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలని చురకలు అంటించాడు. బంగ్లాదేశ్ మైనార్టీలపై కపట ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. బంగ్లాలో మైనారిటీలపై జరుగుతున్న హింస నుంచి దృష్టిని మళ్లించే ప్రయత్నంగా అభివర్ణించారు.

Read Also: Crime News: విశాఖలో మ్యారేజ్ బ్యూరో అరాచకాలు.. యువతులకు మత్తుమందు ఇచ్చి అత్యాచారాలు!

ఇక, గత సంవత్సరం మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా పదవీచ్యుతులైనప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో పరిస్థితి గందరగోళంగా ఉంది. బంగ్లాలో మైనార్టులుగా ఉన్న హిందువులపై తీవ్రవాద ఇస్లామిస్టులు అనేక సార్లు దాడులకు పాల్పడ్డారు. దాదాపు 200 దేవాలయాలను ధ్వంసం చేయగా.. పూజారులను అరెస్టు చేశారు.. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని హింసించారనే ఆరోపణలను బంగ్లాదేశ్ తరచుగా ఖండించింది.

Exit mobile version