Site icon NTV Telugu

Rahul Gandhi: లంచాలు, క‌మీష‌న్ల కోసమే ఎలక్టోరల్ బాండ్లు.. కేంద్రంపై రాహుల్ ఆగ్రహం..

Rahul

Rahul

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ వాటిని నిలిపివేయాలని సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అవినీతి రాజకీయాలు మరోసారి బహిర్గతం అయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్టోరల్‌ బాండ్లను బీజేపీ లంచం, కమీషన్ల కోసమే స్వీకరించేందుకు సాధనంగా మార్చుకుందని ఆరోపించాడు.

Read Also: Komatireddy Venkat Reddy: సీఎం కావాలనే ప్లాన్ లో ఉన్నాడు.. హరీష్ రావు పై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

కాగా, మరోవైపు, కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేష్‌ మాట్లాడుతూ..మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం పార్లమెంట్‌, రాజ్యాంగం తీసుకొచ్చి రెండు చట్టాలను ఉల్లంఘించినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇక, ఎన్నికల బాండ్ల జారీని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్నికల బాండ్ల స్కీమ్‌కు చట్టబద్ధత ఉంటుందా అని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యంగ ధర్మాసనం ప్రశ్నించింది. ఈ ఎలక్టోరల్ బాండ్లు రాజకీయ పార్టీలు, డోనర్ల మధ్య క్విడ్‌ ప్రోకో ఏర్పాటుకు దారితీయవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.

Exit mobile version