NTV Telugu Site icon

Professor Hargopal: మోడీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాడు..

Haragopal

Haragopal

తిరుపతి: దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ప్రొఫెసర్, పౌర హక్కుల నేత హరగోపాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇస్లామిక్ దేశాల తరహాలో భారతదేశంలోనూ మత విలువల ఆధారంగా ప్రత్యామ్నాయ రాజ్యాంగం రాబోతోందని హరగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం-నైతికత అనే అంశంపై తిరుపతి పౌర చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఎస్వీయూ సెనేట్ హాల్లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో హరగోపాల్ మాట్లాడారు.. అలహాబాద్‌లో నిర్వహించిన కుంభమేళాలో మన దేశానికి కొత్త రాజ్యాంగం తయారు చేశారన్నారు. 2024 ఎన్నికల తర్వాత దానికి మద్దతు లభిస్తే కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Read Also: YS Jagan: రాజ్యాంగ కర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దాం: సీఎం జగన్‌

ఇస్లాంలో కానీ, క్రైస్తవంలో కానీ ఒకే దేవుడు, ఒకే తాత్విక చింతన ఉంటుందన్నారు. అందుకే ఇస్లామిక్ దేశాల్లో మత విలువల ప్రాతిపదికన రాజ్యాంగం అమలవుతూ ఉందన్నారు. ప్రస్తుత రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవారు, సమానత్వాన్ని ఆంగీకరించని వారున్నారు. ప్రస్తుత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి సమాజం కంటే ఉన్నతమైన సమాజాన్ని నిర్మించుకోవలసిన సమయంలో ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.