NTV Telugu Site icon

Prof. Kodandaram : కాళేశ్వరం కుంగినట్లే.. కేసీఆర్ ప్రభుత్వం కుంగుతుంది

Kodandaram

Kodandaram

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగం అధికంగా ఉందని బిస్వాల్ కమిటీ నివేదక వెల్లడించిందన్నారు. కాళేశ్వరం కుంగినట్లే…కేసీఆర్ ప్రభుత్వం కుంగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదుగుతోందని ఆయన అన్నారు. సాధించి తెచ్చుకున్న తెలంగాణాను మాటల గారడితో ప్రజలను మోసం చేస్తుండని కోదండరాం విమర్శించారు. కమిషన్ల కక్కుర్తితో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రీ డిజైన్ చేశారని, 6). మూడేళ్ళు పూర్తి కాకముందే మేడిగడ్డ కుంగిపోవడం కేసీఆర్ దోపిడీకి నిదర్శనమన్నారు కోదండరాం.

Also Read : Husband Kills Wife: భార్యను టూర్‌కి తీసుకెళ్లి స్క్రూ డ్రైవర్‌తో 41 సార్లు పొడిచి చంపాడు..

కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు అన్యాయానికి గురయ్యాయని, రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న..భర్తీ చేసేందుకు కేసీఆర్కు సమయం లేదన్నారు కోదండరాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలు…తిప్పిపోతలే తప్ప ఉపయోగంలేదని కోదండరాం వెల్లడించారు. కేసీఆర్​ విచ్చలవిడిగా లిక్కర్​ను అందుబాటులో ఉంచి యువతను తాగుబోతులను చేశాడన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణాల్లో కోట్ల అవినీతి జరిగిందన్నారు. మళ్లీ కేసీఆర్ ని గెలిపిస్తే రాష్ట్రం కోలుకోవడం కష్టమవుతుందన్నారు.

Also Read : Hyderabad : ఒక్క అక్టోబర్ నెలలో రూ.3,170 కోట్ల విలువ గల నివాస ఆస్తుల రిజిస్ట్రేషన్లు..