Site icon NTV Telugu

Satavahana University: శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ప్రొపెసర్ రవి కుమార్!

Prof Jasti Ravi Kumar

Prof Jasti Ravi Kumar

ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మెనేజ్మెంట్ కళాశాల కామర్స్ ప్రొపెసర్ జాస్తి రవి కుమార్ శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం వీసీ ప్రొ. ఉమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొపెసర్ రవి కుమార్ ప్రస్తుతం ఓయూ జిల్లా పీజీ కేంద్రాల డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన సికింద్రాబాద్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా, యుఎఫ్ఆర్ఓ డెరైక్టర్‌గా, సీడీఈ జాయింట్ డెరైక్టర్‌గా, పరీక్షల విభాగం ఆడిషినల్ కంట్రోలర్‌గా, సెంటినరి ఉత్సవాల కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రొపెసర్ జాస్తి రవి కుమార్ పలు పుస్తకాలు రాసి.. జనరల్స్‌లో ఆర్టికల్స్ ప్రచురించారు. సుదీర్ఘ పరిపాలన అనుభవంతో పాటుగా గొప్ప అడ్మినిస్ట్రేటర్‌గా పేరు ప్రఖ్యాతులు గడించారు. తాజాగా శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. శనివారం (డిసెంబర్ 4) ఆయన రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. తనకు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు అప్పగించిన వీసీ ప్రొ. ఉమేష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రిజిస్ట్రార్‌గా మరింత బాధ్యతగా ఉంటానని పేర్కొన్నారు.

Exit mobile version