చీటింగ్ కేసుతోపాటు క్రిమినల్ కేసు.. ప్రొడ్యూసర్ వెంకట్ అనీష్ రెడ్డిపై కేసు నమోదు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ నిర్మాత వెంకట్ అనీష్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరో నిర్మాత రజిత్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చీటింగ్‌తో పాటు పలు క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదుదారు రజిత్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. అనీష్ రెడ్డి కోసం మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ కుమారుడి వద్ద నుంచి రూ.40 లక్షలు ఇప్పించినట్లు తెలిపారు. తనకు ఉన్న రుణాలు క్లియర్ అయిన వెంటనే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని అనీష్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ఫిర్యాదులో వెల్లడించారు.
అయితే.. గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని, పైగా డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని రజిత్ రావు ఆరోపించారు. కోట్ల రూపాయల ఆర్థిక వ్యవహారంలో తనను మోసం చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు అనీష్ రెడ్డిపై సెక్షన్ 318(4) (మోసం), సెక్షన్ 351(2)తో పాటు ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Tags
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!