Natti Kumar: ‘పెద్ది’ కలెక్షన్లపై వస్తున్న రూమర్స్ అన్నీ అబద్ధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్లో వచ్చిన ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో సరికొత్త రికార్డుల వేట కొనసాగిస్తోంది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా వసూళ్లు తగ్గాయంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని నెగిటివ్ రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఈ దుష్ప్రచారంపై ప్రముఖ సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ తీవ్రంగా స్పందించారు. ‘పెద్ది’ చిత్రంపై వస్తున్న వార్తలన్నీ ముమ్మాటికీ అబద్ధాలని ఆయన ఘాటుగా కొట్టిపారేశారు.
ఇండస్ట్రీ ట్రేడ్ గురించి నట్టి కుమార్ మాట్లాడుతూ.. “గత కొంతకాలంగా సరైన పెద్ద సినిమాలు లేక, థియేటర్ల రన్నింగ్ సరిగా లేక ఎగ్జిబిటర్లు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. థియేటర్లన్నీ వెలవెలబోయిన తరుణంలో ‘పెద్ది’ సినిమా ఒక అద్భుతమైన ఊపిరి పోసింది. ఈ చిత్రం సాధిస్తున్న అసాధారణ విజయాలు ఎగ్జిబిటర్లలో సరికొత్త జోష్ నింపాయి. రామ్ చరణ్ ఈ సినిమాలోని తన రెజలర్ పాత్ర కోసం ఎంతో కష్టపడటమే కాదు, ఆ పాత్రకు పూర్తి స్థాయిలో జీవం పోశారు. ఆయన పడ్డ కష్టానికి థియేటర్ల వద్ద ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు” అని ప్రశంసించారు.
Also Read
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ఈ సినిమా కలెక్షన్ల తగ్గుదలపై వస్తున్న పుకార్లలో ఎంతమాత్రం నిజం లేదని నట్టి కుమార్ స్పష్టం చేశారు. ‘పెద్ది’ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటూ, అద్భుతమైన వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శించబడుతోందని క్లారిటీ ఇచ్చారు. సినిమా చూసేందుకు ఆడియన్స్ భారీగా తరలివస్తుండటంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొందని, ఇలాంటి బ్లాక్‌బస్టర్ సినిమాపై కావాలనే కొందరు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం నట్టి కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి.
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!