NTV Telugu Site icon

Prabhas-Spirit: ‘స్పిరిట్‌’ మూవీ అప్‌డేట్‌.. షూటింగ్‌ ప్రారంభం ఎప్పుడంటే?

Spirit

Spirit

రెబల్ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజాసాబ్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఇక యానిమల్ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్‌ ఓ సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి ‘స్పిరిట్’ అనే టైటిల్‌ను ఇప్పటికే ఖరారు చేశారు. పోలీస్‌ డ్రామాగా ఇది రూపొందనుంది. ఇటీవలే స్పిరిట్ మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం కాగా.. తాజాగా నిర్మాత భూషణ్‌ కుమార్‌ షూటింగ్ అప్‌డేట్‌ ఇచ్చారు.

డిసెంబర్‌ చివరలో స్పిరిట్ చిత్రీకరణ మొదలుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని నిర్మాత భూషణ్‌ కుమార్‌ చెప్పారు. ‘భూల్‌ భూలయ్యా 3’ ప్రమోషన్‌ ఇంటర్వ్యూలో భూషణ్‌ కుమార్‌ మాట్లాడుతూ… ‘ప్రస్తుతం స్పిరిట్‌ పనుల్లో బిజీగా ఉన్నాం. నటీనటుల ఎంపిక ఇంకా ఖారారు కాలేదు. నటీనటుల ఎంపికను త్వరలోనే ప్రారంభించి.. షూటింగ్‌ పనులు మొదలుపెడతాం. డిసెంబర్‌ చివరలో షూటింగ్ మొదలుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆరు నెలల తర్వాత యానిమల్‌ పార్క్‌ను సందీప్ రెడ్డి వంగా మొదలుపెడతారు’ అని తెలిపారు.

Also Read: IPL Auction 2025: పంత్‌పై కన్నేసిన మూడు టాప్ టీమ్స్.. రికార్డ్ ధర పక్కా!

దీపావళి సందర్భంగా స్పిరిట్‌ టీమ్ మ్యూజిక్ పనులు మొదలెట్టింది. మ్యూజిక్ కంపోజర్ హర్షవర్ధన్‌ రామేశ్వర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇందులో సందీప్‌ రెడ్డి వంగా మ్యూజిక్ వింటూ కనిపించారు. స్పిరిట్ చిత్రంతో ప్రభాస్ తొలిసారిగా ఖాకీ డ్రెస్‌లో కనిపించనున్నారు. ఇందులో బాలీవుడ్‌ జోడీ కరీనా కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ వివరాలు తెలియరానున్నాయి.

Show comments