Site icon NTV Telugu

ED Raids: కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ ఇంట్లో ఈడీ తనిఖీలు..

Delhi Ed

Delhi Ed

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దగ్గర పని చేస్తున్న పర్సనల్ సెక్రటరీ ఇంట్లో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేస్తుంది. సుమారు 10 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఆమ్ ఆద్మీ పార్టీతో లింకులు ఉన్న ప్రదేశాల్లో నేడు సోదాలు జరుగుతున్నాయి. మ‌నీల్యాండరింగ్ కేసులో భాగంగా ఈ త‌నిఖీలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.

Read Also: Shamshabad: శంషాబాద్ లో భారీగా పట్టబడిన డ్రగ్స్.. 30 మెఫింటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు సీజ్

అయితే, పర్సనల్ సెక్రటరీ బిబ‌వ్ కుమార్‌తో పాటు ఢిల్లీ జ‌ల బోర్డు స‌భ్యుడు శాలాబ్ కుమార్ ఇంట్లోనూ ఈడీ ఆధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దేశ రాజ‌ధాని ఢిల్లీలోనే ఒకే సారి 10 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. భారీ స్థాయిలో జ‌రిగిన ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌తో లింకున్న కేసులో ఈడీ తన ద‌ర్యాప్తు కొనసాగిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ స‌న్నిహితుల ఇళ్లలోనూ ఈడీ రైడ్స్ నిర్వహిస్తుంది. అధికారుల‌తో పాటు రాజ‌కీయ పార్టీతో లింకున్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.

Exit mobile version