ప్రియాంకాగాంధీ.. పరిచయం అక్కర్లేని పేరు. రాజీవ్-సోనియాల కుమార్తెగా.. రాహుల్ గాంధీ సోదరిగా.. రాబర్ట్ వాద్రా భార్యగా ప్రియాంక అందరికీ తెలిసిన ముఖమే. అయితే ఆమె ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఈసారి ఖాయమని అంతా భావించారు. చివరికి తుస్ మనిపించారు. రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగుతున్నారని అంతా ప్రచారం జరిగింది. కానీ చివరికి ఆ స్థానం నుంచి రాహుల్‌గాంధీనే బరిలోకి దిగారు. దీంతో ఒకింత కాంగ్రెస్ శ్రేణులు నిరాశకు గురయ్యారు. అయితే ప్రియాంక పోటీ నుంచి తప్పుకోవడం వెనుక రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నా.. ఆ ఒక్క కారణంతోనే ఆమె పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Uttarakhand : నైనిటాల్‌లోని నైని సరస్సులో వేగంగా కనుమరుగవుతున్న నీరు
ఇప్పటికే తల్లి సోనియా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక సోదరుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా రాయ్‌బరేలీ నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తున్నారు. అంటే ఇప్పటికే గాంధీ ఫ్యామిలీ నుంచి మూడు స్థానాల్లో బరిలోకి దిగారు. ఇక ప్రియాంక కూడా మరో స్థానం నుంచి పోటీ చేస్తే నాల్గో స్థానం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులకు అస్త్రంగా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రియాంక పోటీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని బీజేపీ విమర్శలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రియాంక లోక్‌సభ బరిలోకి దిగకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Health Tips : మామిడిపండ్లు తింటే బరువు పెరుగుతారా?
ఇదిలా ఉంటే సోనియాగాంధీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ప్రియాంక.. రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగొచ్చని బాగా ప్రచారం జరిగింది. కానీ చివరికి అంతా రివర్స్ అయింది. ఇక అమేథీలో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేయొచ్చని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఆయనకు కాకుండా గాంధీ ఫ్యామిలీకి విధేయుడైన కేఎల్.శర్మకు సీటు దక్కింది. ఇక్కడ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీపై 55 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తాజాగా ఎన్నికల్లో స్మృతి ఇరానీకి కేఎల్.శర్మ ఎలాంటి పోటీ ఇవ్వనున్నారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
ఇది కూడా చదవండి: Prasanna Vadanam Review : ప్రసన్నవదనం మూవీ రివ్యూ…