NTV Telugu Site icon

Priyanka Gandhi: జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లకు ప్రియాంక గాంధీ సంఘీభావం

Priyanka Gandhi

Priyanka Gandhi

Priyanka Gandhi: మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. బజరంజ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫొగాట్, ఇతరులు శనివారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తమ తాజా నిరసనను కొనసాగించారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రెజ్లర్లు రెండో రౌండ్ నిరసన చేపట్టారు. బీజేపీ ఎంపీని అన్ని పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ శనివారం ఉదయం నిరసన స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. జ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనకు నాయకత్వం వహిస్తున్న మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫొగాట్‌లతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాట్లాడారు.

Read Also: Karnataka Assembly Elections: కర్ణాటక నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు?.. కాలభైరవ జోస్యం నిజమయ్యేనా?

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు శుక్రవారం రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.మహిళా రెజ్లర్ల నుండి వచ్చిన ఫిర్యాదులపై, కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.. ఎఫ్‌ఐఆర్‌లలో ఒకటి మైనర్ లైంగిక వేధింపుల ఫిర్యాదుపై, లైంగిక నేరాల నుండి పిల్లలను కఠినంగా రక్షించే చట్టం (పోక్సో) కింద నమోదు చేయబడింది. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ ఏడుగురు మహిళా రెజ్లర్లు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులు, ఇతరులకు నోటీసులు జారీ చేసిన తర్వాత ఇది జరిగింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు కూడా క్రీడాకారులకు మద్దతుగా నిలిచారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈరోజు నిరసనలో ఉన్న రెజ్లర్లను పరామర్శించనున్నారు.