NTV Telugu Site icon

Priyanka Gandhi: అమేథీ, రాయ్‌బరేలీలో ప్రియాంక ప్రచారం.. ఖాతాలో వేసుకుంటారా?

Prke

Prke

అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలు కాంగ్రెస్‌కు కంచుకోటలు. ఎప్పుటినుంచో కాంగ్రెస్‌కు బలమైన స్థానాలుగా ఉన్నాయి. అయితే ఈసారి చాలా లేటుగా అభ్యర్థుల్ని ప్రకటించారు. నామినేషన్‌కు చివరి రోజు.. కొన్ని గంటల ముందు హైకమాండ్ అభ్యర్థుల్ని ప్రకటించింది. అయితే ఈ స్థానాలను హస్తం పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఎలాగైనా ఈ స్థానాలను ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రియాంకాగాంధీ రంగంలోకి దిగారు. ఈ రెండు స్థానాలకు ఐదో విడతలో.. అనగా మే 20న పోలింగ్ జరగనుంది. అయితే ప్రచారం గడువు ముగిసే వరకు తాను ఇక్కడే ఉంటానని కార్యకర్తలకు ఆమె సందేశం ఇచ్చారు. అంటే ఈ స్థానాలు కాంగ్రెస్‌కు ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.

ఇది కూడా చదవండి: Shyamala Devi: ఏపీలో ప్రభాస్ పెద్దమ్మ ప్రచారం.. ఎవరికోసమో తెలుసా?

గత ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ 55 వేల ఓట్లతో విజయం సాధించారు. ఈ ఓటమి రాహుల్‌కు పెద్ద తగిలినట్లైంది. అదృష్టవశాత్తు కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ గెలిచి పరువు నిలబెట్టుకున్నారు. అయితే ఈసారి కూడా అమేథీ నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ చివరికి ఆయన రాయ్‌బరేలీకి వెళ్లిపోయారు. అమేథీలో మాత్రం.. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కేఎల్.శర్మను రంగంలోకి దించింది. ఎంతో కాలంగా అమేథీ, రాయ్‌బరేలీలో సేవలు అందించిన అనుభవం ఆయనకు ఉంది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ అతని వైపు మొగ్గు చూపింది. ఇక సోనియా గాంధీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఇక్కడ ప్రియాంక పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి.. కానీ ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. ఇక ఇక్కడ రాహుల్ గాంధీనే బరిలోకి దిగారు. అయితే ఈ రెండు స్థానాలు కాంగ్రెస్‌కు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో వీటి గెలుపు బాధ్యతను ప్రియాంక తన భుజాన వేసుకుంది.

ఇది కూడా చదవండి: Mumbai: ఇండియాకు పాకిన పాలస్తీనా నినాదం.. స్కూల్ ప్రిన్సిపాల్ తొలగింపు

అందుకోసమే అమేథీ, రాయ్‌బరేలీలో ప్రియాంకా గాంధీ సుడిగాలి పర్యటనలతో దూసుకెళ్తున్నారు. అమేథీని తిరిగి దక్కించుకోవడం.. సోదరుడు పోటీ చేస్తున్న రాయ్‌బరేలీలో మరోసారి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. 24 గంటలూ కార్యకర్తలతోనే ఉండి జోష్‌ నింపుతున్నారు. బుధవారం ఒక్క రోజే ఆమె తొమ్మిది సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నారు. మే 18 వరకూ తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని పార్టీ నేతలకు ఆమె స్పష్టం చేశారు.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడత మే 13న జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: Kalki 2898AD: కల్కి అమితాబ్ లుక్ తో టీ20 WC స్పెషల్ వీడియో.. అదిరిపోయింది బ్రో..