NTV Telugu Site icon

Priyanka Gandhi: ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు ప్రజలు గుర్తొస్తారు

Priyanka Gandhi 1

Priyanka Gandhi 1

Priyanka Gandhi Comments: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మల్లు భట్టి విక్రమార్క మధీర నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ‘భట్టి నియోజవర్గానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. రాహుల్ తరహాలోనే భట్టి కూడా తెలంగాణలో పాదయాత్ర చేశారు.. ఇది సంతోషాన్నిస్తోంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే రాహుల్, భట్టి పాదయాత్ర చేశారు. మా అమ్మతో మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రాంతం కోసం కాంగ్రెస్ నేతలు సహా చాలా మంది పోరాడారని సోనియా నాతో చెప్పారు. తెలంగాణ కలలు సాకారం కోసం బలమైన ప్రభుత్వం రాబోతోందని సోనియా సందేశమిచ్చారు’ అని పేర్కొన్నారు.

Also Read: Wife Kills Husband: బర్త్ డే రోజు దుబాయ్‌కి తీసుకెళ్లలేదని.. భర్తను కొట్టి చంపిన భార్య..

అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు. నిన్న నేనో ఇంటికి వెళ్లాను.. వాళ్లతో మాట్లాడాను. అసంపూర్తిగా ఉన్న ఇల్లు చూపించి.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తానిచ్చిన హామీలను మరిచిపోయింది. ఈ ప్రభుత్వం పేదలను వదిలేసి. ధనికుల కోసమే పని చేస్తోంది. ప్రజలే ముఖ్యం.. ప్రజలే అందరిపైనా ఉంటారని మహాత్మగాంధీ మొదలుకుని కాంగ్రెస్ పార్టీ ప్రధానులందరూ అంతే అదే భావించారు. కానీ కేసీఆర్, మోదీ దీనికి విరుద్దంగా ఆలోచన చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతు రుణమాఫీ అమలు చేయలేదు. కనీస మద్దతు ధర పంటలకు లభించడం లేదు. బిడ్డల భవిష్యత్ కోసం తెలంగాణ తల్లులు తల్లడితున్న పరిస్థితి ఉంది.

పేపర్ లీకేజీ ఘటనలతో బిడ్డల భవిష్యత్‌పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ బిడ్డల భవిష్యత్తుని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణ వచ్చిన పదేళ్ల తర్వాత కూడా లక్షల సంఖ్యలో విద్యార్థులు నిరుద్యోగులుగానే ఉన్నారు. కేసీఆర్ ఫ్యామిలీలో చాలా మందికి పదవులు వచ్చాయి. బీఆర్ఎస్ నేతలు ఫాం హౌసుల్లోనే పడుకుంటున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం భట్టి వంటి కాంగ్రెస్ నేతలు.. ప్రజల్లో తిరుగుతూ పాదయాత్రలు చేస్తున్నారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ బుద్దేంటో ప్రజలకు తెలిసిపోయింది. ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆరుకు ప్రజలు గుర్తొస్తారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి జనవరిలో చేయాల్సిన కొన్ని స్కీంలు ఇప్పుడే చేసేస్తున్నారు.

Also Read: Bhatti Vikramarka: వంద కేసీఆర్లు వచ్చినా మధిర గేటు తాకలేరు..

ఎన్నికల ముందు ఇచ్చే స్కీంలను తీసుకోండి.. కానీ ఓటేయొద్దు. పదేళ్ల నుంచి ప్రజలను పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు ప్రజలు ముందుకు వచ్చారు. కేసీఆర్ ఆడే ఆటను ప్రదలందరూ గుర్తించాలి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుతే పోటీ చేస్తోంది. బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు సహకరించుకుంటున్నాయి. ఎంఐఎం కూడా ఆ పార్టీలకే సహకరిస్తోంది. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో 50-60 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. తెలంగాణలో అన్ని స్థానాల్లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదు..? బీజేపీ-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలు ఒక్కటే. భారత్ జోడో యాత్ర చేసిన రాహులును ఒవైసీ ఎందుకు విమర్శిస్తున్నారు..?’ అని ఆమె వ్యాఖ్యానించారు.