NTV Telugu Site icon

SSMB 29 : మహేష్ బాబు షూట్లో జాయినైన ప్రియాంక చోప్రా

Priyanka Chopra

Priyanka Chopra

మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఇప్పటివరకు పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని SSMB 29 అని ప్రస్తావిస్తున్నారు. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్లో ఒక షెడ్యూల్ షూట్ చేశారు. తదుపరి షెడ్యూల్ ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో ప్లాన్ చేశారు. ఇప్పటికే టీమ్ అంతా అక్కడికి చేరుకుంది. తాజాగా అక్కడ జరుగుతున్న ఒక సీన్ వీడియో కూడా లీక్ అయింది. దానిమీద టీం చర్యలు కూడా తీసుకుంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్లో ప్రియాంక చోప్రా కూడా జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది.

READ MORE; AP DGP: మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తాం..

మహేష్ బాబు పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు ప్రియాంక చోప్రా మీద కొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ సినిమాకి కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు రాకుండా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకునే ప్లాన్ చేశారు. కానీ ఒరిస్సాలోని షూటింగ్ వీడియో బయటకు రావడం మాత్రం సినిమా యూనిట్ కి ఒక రకమైన షాక్ అనే చెప్పాలి. దీంతో తాజాగా సెట్లో మరిన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినట్లు తెలుస్తోంది.